Ott Movie: ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Ott Movie: ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘418’ ఓటీటీలోకి రానుంది.

Gagan kumar
Published on: 16 Nov 2026 11:59 AM IST
Ott Movie
X

Ott Movie: ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

418 Movie OTT Release: ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విభిన్నమైన హారర్ థ్రిల్లర్ ‘418’. థియేటర్లలో ఆడియన్స్‌ను భయపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

‘418’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ గురువారం (నవంబర్ 19) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నాదగౌడ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైత్ర జె ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

వెంకీ జీజీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇందులోని హారర్ ఎలిమెంట్స్ , కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా భయపెట్టాయి.

ఊరికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక మెడికల్ కళాశాల హాస్టల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కొన్ని కారణాల వల్ల 15 ఏళ్ల పాటు మూతపడిన ఆ హాస్టల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. అయితే ఆ హాస్టల్‌లోని 418 నంబర్ గదిని మాత్రం ఎవరూ తెరవరు. ఆ గది పేరు చెబితేనే అక్కడి వారు వణికిపోతుంటారు. అంతేకాదు, ఆ హాస్టల్‌లోకి మహిళలకు ప్రవేశం కూడా నిషేధం.

ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ అనే విద్యార్థి పక్కనే ఉన్న 417వ గదిలో చేరతాడు. అప్పటి నుంచే అతనికి ఊహించని, భయంకరమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒక దశలో అతనిపై హత్యాయత్నం కూడా జరుగుతుంది. వీటన్నింటికీ మూలం పక్కనే ఉన్న 418వ గది అని వివేక్‌కు అర్థమవుతుంది.

అసలు 15 ఏళ్లుగా మూసి ఉన్న ఆ గదిలో ఏముంది? ,ఆ గది వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యాలు ఏంటి? ,వివేక్ ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నవంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో ‘418’ సినిమా చూడాల్సిందే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.