Lenin: ఇట్స్ అఫీషియల్.! ఓటీటీలోకి అఖిల్ అక్కినేని 'లెనిన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Lenin: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం 'లెనిన్' త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమవుతోంది.

Ravi
By Ravi
Published on: 2 Aug 2026 10:04 AM IST
Lenin
X

Lenin: ఇట్స్ అఫీషియల్.! ఓటీటీలోకి అఖిల్ అక్కినేని 'లెనిన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Lenin: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం 'లెనిన్' త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ చూడండి.

యంగ్ హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' సొంతం చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 7వ తేదీ నుంచి 'లెనిన్' చిత్రం ఎక్స్‌క్లూజివ్‌గా జీ5 వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. "అయ్యగారు ఆగస్టు 7న వస్తున్నారు.. మీరు రెడీనా?" అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ మాస్ జాతర, ఓటీటీపై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.

చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అఖిల్ అనాథ పాత్రలో నటించగా, ఈశ్వరీరావు, ప్రమోద్ పంజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఊరిలో జరిగే ఉత్సవాలు, ఊహించని మలుపులు, భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లలో సినిమాను చూడని వాళ్లు లేదా ఓటీటీలో మళ్లీ చూడాలనుకునే సినీ ప్రియులు ఆగస్టు 7 నుంచి జీ5లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.



Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story