Con City: ఓటీటీలోకి వచ్చేసిన అర్జున్ దాస్ 'కాన్ సిటీ'..
Con City: టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాన్ సిటీ'.
Con City: ఓటీటీలోకి వచ్చేసిన అర్జున్ దాస్ 'కాన్ సిటీ'..
Con City: టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాన్ సిటీ'. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా నేరుగా ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ అందుబాటులో..
హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కాన్ సిటీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు , ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ హైస్ట్ క్రైమ్ కామెడీ చిత్రం, ఓటీటీలో ఎలాంటి రివ్యూలు తెచ్చుకుంటుందో వేచి చూడాలి.
నటీనటులు … సాంకేతిక నిపుణులు
ఈ చిత్రంలో అర్జున్ దాస్ సరసన అన్నా బెన్ నటిస్తుండగా, కమెడియన్ యోగి బాబు, వడివుక్కరసి, రాధా రవి, తంబి రామయ్య, విటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, పవర్ హౌస్ పిక్చర్స్, క్లౌట్ స్టూడియోస్, ఎం అండ్ ఎం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ క్రైమ్ ఎంటర్టైనర్ను వీక్షించవచ్చు.




