Ott Movie: ఒక్క క్లూ దొరకని మర్డర్ మిస్టరీ.. ఓటీటీలో అదరగొడుతున్న సస్పెన్స్, థ్రిల్లర్

Ott Movie: జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా'. భరత్ శ్రీనివాసన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Gagan kumar
Published on: 19 Sept 2026 11:42 AM IST
Ott Movie
X

Ott Movie: ఒక్క క్లూ దొరకని మర్డర్ మిస్టరీ.. ఓటీటీలో అదరగొడుతున్న సస్పెన్స్, థ్రిల్లర్ 

Ott Movie: ఓటీటీ ప్రియులకు క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కేటగిరీలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) సెప్టెంబర్ 11 నుంచి ‘పంచనామా’ అనే సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేస్తోంది.

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా, సీనియర్ యాంకర్, నటి ఉదయభాను నిర్మాతగా, షో రన్నర్‌గా వ్యవహరించారు. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఓటీటీలో రికార్డు వ్యూస్‌ సాధిస్తోంది. నగరంలో వరుసగా జరిగే మూడు అనుమానాస్పద హత్యలు, వాటిని ఛేదించేందుకు రంగంలోకి దిగే ఐపీఎస్ ఆఫీసర్ కథతో ఈ సిరీస్ సాగుతుంది.

ఏ ఒక్క చిన్న క్లూ కూడా వదలకుండా అత్యంత పకడ్బందీగా జరిగే హత్యలు పోలీసులకు సవాలుగా మారుతాయి. పోలీస్ ఆఫీసర్‌గా భరత్ శ్రీనివాసన్ ఆ సీరియస్ కేసును ఛేదించే క్రమంలో ఎదుర్కొనే ముప్పులు, ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆద్యంతం ఉత్కంఠను నింపుతాయి. 6 ఎపిసోడ్ల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ ఇది అంతం కాదు.. ఆరంభం అన్నట్టుగా ముగుస్తుంది.

దీంతో వెంటనే సీజన్-2* ఎప్పుడు వస్తుందా అనే ఉత్సుకత ప్రేక్షక లోకంలో నెలకొంది. గ్రిప్పింగ్ నారేషన్, ఊహించని మలుపులు ఉండటంతో ఈ సిరీస్ విడుదలైన కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్లకు పైగా డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ‘పంచనామా’ బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

పోలీస్ ఆఫీసర్‌గా భరత్ శ్రీనివాసన్ తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. సీరియస్ లుక్, ఇన్వెస్టిగేటివ్ మేనరిజమ్స్‌తో పాత్రలో ఒదిగిపోయారు. మోహన్ శ్రీవత్స టేకింగ్, నరేష్ కుమరన్ అందించిన రీ-రికార్డింగ్ , సందీప్ కాంత్ కెమెరా పనితనం ఈ సిరీస్‌కు ప్రాణం పోశాయి. మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. మీరు కూడా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న మంచి సిరీస్ కోసం చూస్తున్నట్లయితే.. జీ5లో అందుబాటులో ఉన్న ‘పంచనామా’ సిరీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.