OTT: గంటల తరబడి వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారా? రోజూ 4 గంటలు దాటితే గుండెకు ముప్పే.!
OTT: గంటల తరబడి OTT చూస్తే ఆరోగ్యానికి ముప్పు. రోజూ 4 గంటలు దాటితే గుండె ప్రమాదం 50 శాతం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
OTT: గంటల తరబడి వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారా? రోజూ 4 గంటలు దాటితే గుండెకు ముప్పే.!
OTT: వీకెండ్ వస్తే చాలామంది OTTల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వరుసగా చూస్తుంటారు. అయితే తరచుగా ఇలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు భంగం కలగడం, కళ్లకు ఒత్తిడి, బరువు పెరగడం, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రతి 30-60 నిమిషాలకు గ్యాప్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రోజూ 4 గంటలకు పైగా చూస్తే గుండెపోటు, మరణం రిస్క్ 50 శాతం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ అంశంపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో 2019లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. మిస్సిస్సిప్పిలోని జాక్సన్ హార్ట్ స్టడీలో భాగంగా 3,592 మందిని సుమారు 8.5 ఏళ్లు పరిశీలించారు. రోజుకు 4 గంటలకు పైగా టీవీ చూసినవారికి, 2 గంటల కంటే తక్కువ చూసినవారితో పోలిస్తే గుండెపోటు, పక్షవాతం, మరణం ముప్పు 50 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఆఫీసులో కూర్చుని పనిచేయడం వల్ల ఇలాంటి ప్రభావం కనిపించలేదు. ఇంట్లో టీవీ ముందు కూర్చోవడమే ఎక్కువ హానికరమని పరిశోధకులు గుర్తించారు. రాత్రి భోజనం చేసే సమయంలో లేదా తర్వాత గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.
అంతకుముందు 2011లో స్కాట్లాండ్‌లో 4,512 మంది పెద్దలపై జరిగిన పరిశోధనలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. రోజుకు 4 గంటలకు పైగా టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపినవారిలో గుండె సమస్యల ముప్పు రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే వారానికి 150 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యాయామం చేసేవారిలో టీవీ చూడటం వల్ల అదనపు ముప్పు కనిపించలేదని జాక్సన్ అధ్యయనం చెబుతోంది. వేగంగా నడవడం లేదా ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. టీవీ చూస్తూ స్టేషనరీ బైక్ తొక్కడం, మధ్యమధ్యలో లేచి నిలబడటం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.




