Ott Movie: రూ. 3 కోట్ల బడ్జెట్.. రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు..మెంటలెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్..!
Ott Movie: థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Ott Movie: రూ. 3 కోట్ల బడ్జెట్.. రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు..మెంటలెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్..!
Pradhama Drishtya Kuttakkar: మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై, సంచలన విజయం సాధించిన అలాంటి ఒక అద్భుతమైన మలయాళ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
కేవలం రూ. 3 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎమ్‌డీబీలోనూ ఈ చిత్రానికి 7.8 రేటింగ్ లభించడం విశేషం.
ఈ సినిమా కథ చాలా కొత్తగా మరియు ఉత్కంఠభరితంగా సాగుతుంది. కారుణ్య నియామకం కింద పోలీస్ ఉద్యోగం సంపాదించిన అలీనా అబ్రహాం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓ పోలీస్ స్టేషన్లో రాత్రి విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది.
ఆ నేరం బయటకు రాకుండా ఉండేందుకు అదే పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వారు తమకున్న తెలివితేటలను, పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. క్రైమ్ సీన్ గురించిన లోతుపాతులు, పోలీస్ శాఖ విధివిధానాలు పూర్తిగా తెలిసిన వారు కావడంతో.. ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విజయరాఘవన్ చేపడతారు.
దీంతో నేరానికి పాల్పడిన పోలీసులకు, దర్యాప్తు అధికారికి మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. మరి ఎవరికీ తెలియకుండా చేసిన నేరాన్ని ఆ పోలీసులు ఎలా దాచారు? విజయరాఘవన్ వారికి ఎలా చెక్ పెట్టారు? చివరికి అసలు నిజం ఎలా బయటపడింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే. థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. నేడు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ వీకెండ్లో ఇది పర్ఫెక్ట్ వాచ్.




