OTT: రూ.320 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..!

OTT: బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

Gagan kumar
Updated on: 2 Oct 2026 11:46 AM IST
OTT
X

OTT: రూ.320 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..!

OTT: థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఒక సంచలన సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కితే, ఓవరాల్‌గా రూ. 320 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మలయాళ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు మీ ఇంట్లోనే వినోదం పంచేందుకు సిద్ధమైంది. అదే ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’.

మలయాళంలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా అందించారు. తెలుగులోనూ ఈ మూవీకి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను థియేటర్లలో ఎగబడి చూశారు.

'ప్రేమలు' లాంటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీతో యూత్‌ను ఫిదా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ గిరీష్ ఏడీ ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించగా, 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ట్రెండింగ్ హీరోయిన్‌గా అలరించింది. వీరితో పాటు సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ కీలక పాత్రల్లో నటించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. విష్ణు విజయ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారందరికీ శుభవార్త. అక్టోబర్ 02 శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఒరిజినల్ మలయాళం వెర్షనే కాకుండా, తెలుగులోనూ ఇది అందుబాటులో ఉండటం విశేషం. మరి వీకెండ్‌లో కుటుంబసమేతంగా లేదా స్నేహితులతో కలిసి మంచి వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటే, ఈ న్యూ ఏజ్ లవ్ , ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అస్సలు మిస్ కావద్దు.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.