Ott Release: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రూ.300 కోట్ల సినిమా
Ott Release: బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రవితేజ డివోషనల్ థ్రిల్లర్ ‘ఇరుముడి’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Ott Release: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రూ.300 కోట్ల సినిమా
Ott Release: మాస్ మహరాజా రవితేజ అంటేనే ఎనర్జీ.. బాక్సాఫీస్ వద్ద ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈసారి ఆయన పూర్తిగా ట్రాక్ మార్చి చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టించింది. ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కావస్తున్నా, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లలో గుంపులు గుంపులుగా జనం తరలివచ్చి మరీ ఈ సినిమాను చూస్తుండడం విశేషం. థియేటర్లలో ఈ ఊచకోత అలా కొనసాగుతుండగానే, డిజిటల్ ప్రియులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసింది.
థియేటర్లలో అప్పుడే తగ్గని జోరుతో రికార్డులు సృష్టిస్తున్న 'ఇరుముడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతుండడంతో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర తన క్యూట్ యాక్టింగ్‌తో కన్నీరు పెట్టించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ఇక ఈ సినిమా విజయానికి జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. ముఖ్యంగా థియేటర్లలో 'మల్లెపూల పల్లకి' పాట వస్తున్న సమయంలో ప్రేక్షకులు సీట్ల నుంచి లేచి మరీ పూలు చల్లి, హారతులు పట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగింది. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'ఇరుముడి'.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి డిజిటల్ రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.




