Dhurandhar 2 OTT: ధురంధర్ 2 ఓటీటీపై అప్డేట్.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఎప్పటి నుంచి రానుంది..
Dhurandhar 2 OTT: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో తెలిసిందే. ఇప్పటి వరకు ఏకంగా రూ. 1700 కోట్లకుపైగా రాబట్టిన ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
Dhurandhar 2 OTT
Dhurandhar 2 OTT: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో తెలిసిందే. ఇప్పటి వరకు ఏకంగా రూ. 1700 కోట్లకుపైగా రాబట్టిన ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
మార్చి 19న థియేటర్లలో విడుదలైన ధురంధర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలై కొన్ని వారాలు గడిచినా చాలా చోట్ల ఈ చిత్రం ఇంకా హౌస్‌ఫుల్ షోలతో నడుస్తుండటం విశేషం. ఇదే సమయంలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ విడుదలపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ‘ధురంధర్ 2’ మంచి స్పందనను అందుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ సినిమా రూ.2000 కోట్ల మార్క్ దాటే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే మొదటి రెండు వారాల వేగంతో పోలిస్తే మూడో వారంలో కలెక్షన్లు కొంత తగ్గాయి. ముఖ్యంగా హిందీ, తెలుగు మార్కెట్లలోనే సినిమా ఇంకా మంచి ఆదరణ పొందుతుండగా, ఇతర భాషలలో వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి థియేటర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ఓటీటీ హక్కులు ఎవరికి.?
‘ధురంధర్’ మొదటి భాగం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ‘ధురంధర్ ది రివేంజ్’ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా, ఓటీటీ వర్గాల్లో ఈ వార్త బలంగా వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో సాధారణంగా థియేటర్లలో కొంతకాలం నడిచిన తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అదే విధంగా ఈ సినిమా విషయంలో కూడా అదే పద్ధతి పాటించే అవకాశం ఉంది.
ఓటీటీలోకి వచ్చే తేదీ ఎప్పుడంటే?
సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్ విడుదల తర్వాత 50 నుంచి 60 రోజుల మధ్య ఓటీటీలోకి వస్తుంటాయి. అదే ట్రెండ్‌ను అనుసరించినట్లయితే ‘ధురంధర్ 2’ కూడా అదే సమయానికి డిజిటల్ విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మే రెండో వారంలో ఓటీటీలోకి రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మే 8 లేదా మే 15 ప్రాంతంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


