ఓటీటీకి వస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘దివానా’..
Deewana: హర్షిత్ రెడ్డి , స్నేహ మణిమేగలై జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘దివానా’.
ఓటీటీకి వస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘దివానా’..
Deewana: హర్షిత్ రెడ్డి , స్నేహ మణిమేగలై జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘దివానా’ . ఈ చిత్రం గత నెల జూన్ 19, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనతో పాటు పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా, తన థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని తాజాగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
జూలై 31 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్..
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ విడుదలను తాజాగా ప్రకటించింది. ఈ రొమాంటిక్ డ్రామా జూలై 31, 2026 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, ‘ఆహా గోల్డ్’ చందాదారులకు మాత్రం ఒక రోజు ముందుగానే అనగా జూలై 30, 2026 నుంచే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పర్వాలేనిపించుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
నటీనటులు , సాంకేతిక వర్గం
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పణలో వాసుదేవ్ కొప్పిశెట్టి , శ్రీదేవి కార్యమపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. లీడ్ జోడీతో పాటు నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్, బలగం వేణు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.




