Crime Thriller: ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్!

Crime Thriller: థియేటర్లలో సంచలన విజయం సాధించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ది థర్డ్ మర్డర్' నవంబర్ 13 నుంచి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

Gagan kumar
Published on: 2 Nov 2026 1:24 PM IST
Crime Thriller
X

Crime Thriller: ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్!

The Third Murder: మలయాళ చిత్రాలకు ప్రస్తుతం భారతీయ సినిమా వేదికపై ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటెంట్ ఆధారిత కథలతో ప్రేక్షకులను అలరించే మాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మలయాళ సస్పెన్స్, క్రైమ్, హారర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రాలు రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్ సాధిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మరో మైండ్ బ్లోయింగ్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది థర్డ్ మర్డర్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్స్ IMDb లో 8.4/10, BookMyShow లో 7.9/10 అత్యుత్తమ రేటింగ్‌లు సొంతం చేసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత.

ఒకానొక నగరంలో జరిగే వరుస అనుమానాస్పద హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొదట డ్రగ్ డీలర్ జస్టిన్ దారుణ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వ్యాపారవేత్త బోబన్ కూడా అదే తరహాలో దారుణంగా హత్య చేయబడతాడు. ఈ సీరియల్ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ డివైఎస్పీ క్రిస్టీ రంగంలోకి దిగుతాడు.

అయితే ప్రాథమిక విచారణలో పోలీసులకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించవు. దీంతో సైకోపాత్‌లు, సీరియల్ కిల్లర్స్ మనస్తత్వాలను విశ్లేషించడంలో దిట్ట అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ స్వామి సహాయాన్ని క్రిస్టీ తీసుకుంటాడు.

అసలు ఆ ఇద్దరినీ చంపిన అజ్ఞాత కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? మూడో హత్య జరగకుండా పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. దర్శకుడు సునీల్ ఇబ్రహీం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మలిచారు. సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్‌లతో పాటు అనన్య, మణికందన్ పటాంబి, లియోనా లిషాయ్ తదితరులు తమ నటనతో మెప్పించారు.

థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘ది థర్డ్ మర్డర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘మనోరమ మ్యాక్స్’ ,‘సింప్లీ సౌత్’ దక్కించుకున్నాయి. ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ఓటీటీలోకి రానుంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు తదితర దక్షిణ భారత భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ అని చెప్పవచ్చు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.