Isakapatnam: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ‘ఇసకపట్నం’.. వచ్చే నెల నుంచే డిజిటల్ ఎంట్రీ!
Isakapatnam: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ప్రియులకు అమెజాన్ ప్రైమ్ వీడియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
Isakapatnam: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ‘ఇసకపట్నం’.. వచ్చే నెల నుంచే డిజిటల్ ఎంట్రీ!
Isakapatnam: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ప్రియులకు అమెజాన్ ప్రైమ్ వీడియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. టాలీవుడ్‌లో ఎంతో అంచనాలున్న ఒరిజినల్ క్రైమ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘ఇసకపట్నం’ గ్లోబల్ డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను అధికారికంగా లాక్ చేసింది. జూలై 2వ తేదీన ఈ ఒరిజినల్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడటంతో సోషల్ మీడియాలో ఈ గ్రిట్టీ అండ్ రా సిరీస్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
తొంభైల నాటి కోస్తా పోర్ట్ టౌన్ కథ..
ఈ సిరీస్ కథాంశం 1990ల కాలం నాటి ఒక పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నేరాలు, రాజకీయం, గ్యాంగ్‌స్టర్ ముఠాల మధ్య సాగే ఆధిపత్య పోరాటాల చుట్టూ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఆ పట్టణాన్ని శాసించే అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యానికి ముగ్గురు వ్యక్తుల వల్ల ముప్పు వాటిల్లుతుంది. న్యాయం కోసం పోరాడే ఒక మహిళ, నైతిక విలువల మధ్య నలిగిపోయే ఒక నమ్మకమైన అనుచరుడు , పగ కోసం రగిలిపోయే ఒక సాధారణ వ్యక్తి.. ఈ ముగ్గురి శక్తుల మధ్య జరిగే ఘర్షణే ఈ సిరీస్ ప్రధానాంశం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా అధికారం వల్ల వ్యక్తిగత బంధాలు ఎలా దెబ్బతింటాయనే ఎమోషనల్ పాయింట్‌ను కూడా ఇందులో చూపించబోతున్నారు.
భారీ తారాగణం.. ప్రశాంత్ రాగతి మార్క్ స్క్రీన్‌ప్లే
వెర్సటైల్ నటులు సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. వారితో పాటు టాలెంటెడ్ యాక్టర్స్ సునీల్, నరేష్ అగస్త్య, మైమ్ గోపి, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ రాగతి కథను అందించగా.. తజుద్దీన్ సయ్యద్ పవర్ ఫుల్ డైలాగులు రాశారు. ఒక డార్క్ అండ్ అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
తమడా మీడియా ప్రొడక్షన్..
ప్రముఖ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ హౌస్ ‘తమడా మీడియా’ పతాకంపై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. నమ్మకద్రోహాలు, మారుతున్న సమీకరణాలు , మనుగడ కోసం సాగించే పోరాటం థీమ్‌తో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ డే సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ క్రేజీ క్రైమ్ జూలై 2న డిజిటల్ స్క్రీన్లపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.




