Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ట్రాన్స్‌జెండర్ సినిమా!

Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘డోరతి’ ఓటీటీలోకి వచ్చేసింది.

Gagan kumar
Published on: 24 Oct 2026 1:04 PM IST
Keerthy Suresh
X

Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ట్రాన్స్‌జెండర్ సినిమా!

Dorathi Out on OTT: 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డోరతి’. రిషికాంత్, సనత్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ట్రాన్స్‌జెండర్, LGBTQ+ వంటి సున్నితమైన అంశాల నేపథ్యంలో రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 25న తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 'స్పిరిట్ మీడియా' ద్వారా అక్టోబర్ 02న తెలుగు ప్రేక్షకులకు అందించారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి కథాంశంతో సినిమాలు రాకపోవడం, కథాకథనాలు ఎంతో కొత్తగా ఉండటంతో ఈ సినిమా విడుదల నుంచే ఆసక్తి రేపింది. అయితే, చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమై, సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా తలెత్తాయి.

అన్ని వివాదాలను దాటుకుని ‘డోరతి’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించడం విశేషం.

థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో అలరించిన ‘డోరతి’ సినిమా నెల రోజులు తిరగకముందే డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించినట్లే, శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో చూడడం మిస్ అయిన వారు, వివాదాస్పదమైన ఈ కొత్త తరహా కథాంశాన్ని ఓటీటీలో వీక్షించవచ్చు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.