OTT Movies: ఈ వారం ఓటీటీలో 15కుపైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Weekend Watchable Movies: థియేటర్లలో సినిమాలు చూడలేని వారికి ఓటీటీ వేదికలు అద్భుతమైన వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి.
OTT Movies: ఈ వారం ఓటీటీలో 15కుపైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Weekend Watchable Movies: థియేటర్లలో సినిమాలు చూడలేని వారికి ఓటీటీ వేదికలు అద్భుతమైన వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. రవితేజ, విశ్వక్సేన్ సినిమాలతో పాటు అంతర్జాతీయ సిరీస్‌లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికలో తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
విశ్వక్సేన్ ‘ఫంకీ’ ఓటీటీలో..
యువ హీరో విశ్వక్సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. వినోదభరిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్యామిలీ ఎమోషన్‌తో ‘నవాబ్స్ కేఫ్’..
శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నవాబ్స్ కేఫ్’ అనే సినిమా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. ‘చాయ్‌వాలా’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం ఫాదర్-సన్ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘మేడిన్ కొరియా’ ఆసక్తికర కథ..
ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ కొరియా’ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదలైంది. తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచే దక్షిణ కొరియాకు వెళ్లాలని కలలు కనడం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, అక్కడి అనుభవాలు ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళ సినిమా ‘పెన్నుమ్ పోరాట్టమ్’..
మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘పెన్నుమ్ పోరాట్టమ్’ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇతర ఓటీటీ వేదికల్లో వచ్చిన సినిమాలు/సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్:
గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ)
వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్/తెలుగు వెబ్‌సిరీస్)
వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)
జియో హాట్‌స్టార్:
ది మ్యాడిసన్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)
జూటోపియా 2 (ఇంగ్లీష్/తెలుగు మూవీ)
రిసార్ట్ (తమిళ్/తెలుగు వెబ్‌సిరీస్)
రూస్టర్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)
సన్ నెక్ట్స్:
సుక్రాన్ (మలయాళ మూవీ)
ఫ్రైడే (తమిళ్ మూవీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో:
లాక్డౌన్ (తమిళ్/తెలుగు మూవీ)
కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు/తమిళ్ మూవీ)
ది తాజ్ స్టోరీ (హిందీ/తెలుగు మూవీ)
లోకల్ టైమ్స్ (తమిళ్ వెబ్‌సిరీస్)
స్కార్పెట్టా (ఇంగ్లీష్/తెలుగు వెబ్‌సిరీస్)
ఆస్పిరెంట్స్ (హిందీ/తెలుగు వెబ్‌సిరీస్)
యానివర్సరీ (ఇంగ్లీష్/తెలుగు మూవీ)
జీ5:
అంధప్యార్ 2 (హిందీ వెబ్‌సిరీస్)
బూకీ (తమిళ్/తెలుగు మూవీ)
ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్..
ప్రస్తుతం ఓటీటీ వేదికలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందిస్తున్నాయి. విభిన్న భాషల్లో వచ్చే కంటెంట్ వల్ల ప్రతి వారం కొత్త వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం కలుగుతోంది.




