Moda Kavida Vathavarana : ప్రైమ్‌లో కొత్త కన్నడ థ్రిల్లర్.. కొండల్లో దాగిన ఆ మిస్టరీ ఏంటి.?

Moda Kavida Vathavarana : యువతను ఎక్కువగా ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌కు ఓటీటీల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందులో భాగంగానే కన్నడలో

G Krishna
Published on: 18 Aug 2026 8:35 PM IST
Moda Kavida Vatavarana
X

Moda Kavida Vatavarana

Moda Kavida Vathavarana : యువతను ఎక్కువగా ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌కు ఓటీటీల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందులో భాగంగానే కన్నడలో తెరకెక్కిన 'మోద కవిదా వాతావరణ' అనే చిత్రం థియేటర్ల తర్వాత ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్' వేదికగా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. షీలం ఎమ్ స్వామి, మోక్ష కుషాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సింపుల్ సుని దర్శకత్వం వహించారు.

రిసార్ట్ వేదికగా మారిన విచిత్ర బంధాలు

హిల్ స్టేషన్‌లోని ఒక అందమైన రిసార్ట్‌కు ఛరీష్-సాత్విక జంట సరదాగా గడిపేందుకు వస్తుంది. అదే సమయంలో ధనుశ్, సౌపర్ణిక అనే మరో జంట కూడా అక్కడికి చేరుకుంటుంది. అయితే, మొదటి చూపులోనే సౌపర్ణిక వైపు ఆకర్షితుడైన ఛరీష్, ఆమెతో పరిచయం పెంచుకునేందుకు ఆసక్తి చూపుతాడు. అతడి ప్రవర్తనలోని ఈ మార్పును సాత్విక వెంటనే పసిగట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది.

మరోవైపు ఛరీష్ చొరవతో సౌపర్ణిక అతడికి త్వరగానే దగ్గరవుతుంది. ఇద్దరూ కలిసి అక్కడి కొండలు, జలపాతాల వద్ద తిరగడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే సాత్వికతో బ్రేకప్ అయ్యాక ప్యాచప్ కోసమే ఛరీష్ ఇక్కడికి వచ్చాడని సౌపర్ణిక తెలుసుకోగా, తండ్రి బలవంతం వల్లే ధనుష్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని ఆమె ఛరీష్‌తో పంచుకుంటుంది. వీరిద్దరి ఈ విచిత్ర ధోరణి మిగతా ఇద్దరికీ తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది.

స్కూల్ డేస్ మిస్టరీ.. వెంటాడే ఆ వ్యక్తి ఎవరు?

కథలో అసలు మలుపు సౌపర్ణిక తన గతాన్ని తవ్వుకున్నప్పుడు మొదలవుతుంది. స్కూల్ రోజుల్లో ఒక క్లాస్‌మేట్ తనపై దొంగతనం ముద్ర వేశాడని, అప్పటి నుంచి అతడు తన ప్రతి కదలికను రహస్యంగా గమనిస్తూ ఫాలో అవుతున్నాడని ఛరీష్‌తో చెబుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉన్న రిసార్ట్‌కు కూడా అతడు వచ్చి, ఎక్కడో దాక్కుని తనను గమనిస్తున్నాడనే నిజాన్ని బయటపెడుతుంది. ఈ క్రమంలో సౌపర్ణికను వెంటాడుతున్న ఆ వ్యక్తి ఎవరు? అతడి మిస్టరీని ఛేదించేందుకు ఛరీష్ ఏం చేశాడు? వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనేదే మిగతా కథ.

మేఘాలు కమ్మిన కథనం.. వీడిన సస్పెన్స్

'మోద కవిదా వాతావరణం' అంటే 'మేఘాలు కమ్మిన వాతావరణం' అని అర్థం. కొండ ప్రాంతంలో సాగే ఈ కథలో హీరోయిన్ తన సమస్యను చెప్పినంత వరకు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంటుంది. అయితే, ఆ సస్పెన్స్ వీడిన తర్వాత కథనం చాలా రొటీన్‌గా మారిపోతుంది. కొండలు, జలపాతాలు, పొగమంచు లొకేషన్ల నుంచి ప్రేక్షకులు ఆశించే రొమాన్స్ గానీ, బలమైన లవ్ ట్రాక్ గానీ ఇందులో కనిపించవు. కేవలం హీరోయిన్ సమస్యను పరిష్కరించే హీరో చుట్టూనే కథ నడుస్తుంది.

సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయంటే?

దర్శకుడు ఎంచుకున్న కథాంశంలో బలం లేకపోవడంతో సన్నివేశాలు కూడా పేలవంగా తయారయ్యాయి. నటీనటుల నటనకు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల ఇవి. ఛాయాగ్రహణం ఆహ్లాదకరమైన లొకేషన్లను బాగా చూపించినప్పటికీ, సాగదీసిన సంభాషణలు, సాధారణ నేపథ్య సంగీతం నెమ్మదిగా అనిపిస్తాయి. పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ లేని ఈ చిత్రం, అందమైన వాతావరణంలో సాగే ఒక సాధారణ రొటీన్ కథగానే మిగిలిపోతుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story