Money Heist : 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్.. పోరాటం ఇంకా ముగియలేదు..!

Money Heist : ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రంగంలో ఒక సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’ (Money Heist). ఈ స్పానిష్ క్రైమ్ డ్రామాకు ఉన్న క్రేజ్

G Krishna
Published on: 11 May 2026 6:21 PM IST
Money Heist
X

Money Heist

Money Heist : ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రంగంలో ఒక సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’ (Money Heist). ఈ స్పానిష్ క్రైమ్ డ్రామాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సిరీస్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘మనీ హెయిస్ట్’ ప్రయాణం ఇంకా కొనసాగుతోందని ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దీంతో ప్రొఫెసర్ గ్యాంగ్ మళ్లీ రాబోతోందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.

ఆసక్తి రేకెత్తిస్తున్న గ్లింప్స్.. పోరాటం పూర్తి కాలేదు!

తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో గత సీజన్లలోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలను చూపిస్తూ మేకర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రయాణం మొదట డబ్బుతో మొదలైంది.. ఆ తర్వాత బంగారం వైపు మళ్లింది.. ఆపై వెలకట్టలేని నిధి కోసం సాగింది. కానీ, పోరాటం ఇంకా పూర్తి కాలేదు" అంటూ రాబోయే ప్రాజెక్టుపై హింట్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ‘మనీ హెయిస్ట్’ నుంచి కొత్త సీజన్ రాబోతోందా? లేక మరో స్పిన్-ఆఫ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఓటీటీలో 1.3 బిలియన్ల గంటల వీక్షణలతో సరికొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే.

స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘బెర్లిన్’ సీజన్ 2

‘మనీ హెయిస్ట్’ సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రల్లో 'బెర్లిన్' ఒకటి. ఈ పాత్ర నేపథ్యంతో రూపొందిన స్పిన్-ఆఫ్ సిరీస్ ‘బెర్లిన్’ మొదటి సీజన్ 2023లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రొఫెసర్ గ్యాంగ్‌తో చేరకముందు బెర్లిన్ చేసిన భారీ దోపిడీల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ రెండవ సీజన్ (Berlin Season 2) స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘బెర్లిన్ 2’ అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలోనే ‘మనీ హెయిస్ట్’ గ్లింప్స్ విడుదల చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

రికార్డుల వేటలో స్పానిష్ సిరీస్

భాషతో సంబంధం లేకుండా అనేక దేశాల్లో అనువాదమై, యువతను విశేషంగా అలరించిన సిరీస్ ఇది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్, రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ వంటి చోట్ల జరిగే భారీ దోపిడీలు, వాటి వెనుక ప్రొఫెసర్ మాస్టర్ ప్లాన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు బెర్లిన్ సీజన్ 2 రాబోతుండటం, అదే సమయంలో ప్రధాన సిరీస్‌కు సంబంధించి ప్రకటన రావడంతో మేకర్స్ ఇంకేదో పెద్ద ప్లానే చేసినట్లు కనిపిస్తోంది. మరి ప్రొఫెసర్ మళ్లీ మాస్క్ వేసుకుంటాడా? కొత్త మిషన్ ఏంటి? అనే వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ‘బెర్లిన్’ సీజన్ 2 కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story