Naga Chaitanya: ప్రొడ్యూసర్‌గా నాగ చైతన్య కొత్త అవతారం!
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ ఇస్తూ నటించిన సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే.
Naga Chaitanya: ప్రొడ్యూసర్‌గా నాగ చైతన్య కొత్త అవతారం!
Naga Chaitanya: అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ ఇస్తూ నటించిన సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్, ఓటీటీ ప్రియులను ఎంతగానో అలరించడమే కాకుండా చైతూ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలిచింది. అప్పటినుండి ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ‘దూత సీజన్ 2’ అఫీషియల్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున..
హైదరాబాద్‌లో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి అక్కినేని నవమన్మథుడు, సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్ర యూనిట్‌ను ఆశీర్వదిస్తూ ముహూర్తపు షాట్‌కు నాగార్జున క్లాప్ బోర్డ్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సరికొత్త సీజన్ లో ఒక ఊహించని సర్ప్రైజ్ దాగి ఉంది. మొదటి సీజన్ తో కేవలం నటుడిగా డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య.. ఈ రెండో సీజన్‌తో ప్రొడ్యూసర్‌గా కొత్త అవతారమెత్తబోతున్నారు. తండ్రి నాగార్జున దారిలోనే వెళ్తూ, కథపై , దర్శకుడి విజన్‌పై ఉన్న నమ్మకంతోనే చైతూ ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణ భాగస్వామిగా మారడం విశేషం.
అదే క్రేజీ కాంబినేషన్.. మరింత ఇంటెన్స్ థ్రిల్లర్!
సిరీస్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఒరిజినల్ క్రియేటివ్ టీమ్ మొత్తం ‘దూత 2’ కోసం మళ్లీ చేతులు కలిపింది. టాలెంటెడ్ మేకర్ విక్రమ్ కె కుమార్ ఈ సీజన్‌ను మరింత గ్రిప్పింగ్‌గా, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. శరత్ మరార్తో కలిసి నాగ చైతన్య నిర్మాణ బాధ్యతలు చూసుకోనున్నారు. మొదటి సీజన్లో కీలక పాత్రల్లో మెరిసిన వైవిధ్యభరిత నటి పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీక్వెల్లోనూ భాగం కానున్నారు.
త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో ఒక జర్నలిస్ట్ జీవితంలోకి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఎలా వచ్చాయనే పాయింట్‌ను చూపించగా, ఈసారి అంతకుమించిన సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.




