The Paradise: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్..సీన్స్ కట్ చేసి కొత్తగా ఎడిట్ చేసిన శ్రీకాంత్ ఓదెల!

The Paradise: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్..సీన్స్ కట్ చేసి కొత్తగా ఎడిట్ చేసిన శ్రీకాంత్ ఓదెల!

Gagan kumar
Published on: 19 Oct 2026 1:13 PM IST
The Paradise
X

The Paradise: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్..సీన్స్ కట్ చేసి కొత్తగా ఎడిట్ చేసిన శ్రీకాంత్ ఓదెల!

Nani The Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 22 నుండి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 4K డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ అత్యున్నత సాంకేతిక నాణ్యతతో అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా వెల్లడైంది.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో ఆ స్థాయి హైప్‌ను అందుకోవడంలో సినిమా తడబడింది. ఫస్టాఫ్ మెప్పించినప్పటికీ, సెకండాఫ్‌లో కథనం గాడి తప్పడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.

విడుదల హడావిడి వల్ల ఎడిటింగ్‌లో కొన్ని లోపాలు జరిగాయని స్వయంగా నాని కూడా అంగీకరించారు. ముఖ్యంగా సినిమాలో మితిమీరిన రక్తపాతం, వైలెంట్ సీన్లు, హీరోయిన్ క్యారెక్టర్‌పై చిత్రీకరించిన బోల్డ్ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురిచేశాయి. దీంతో థియేట్రికల్ రన్ త్వరితగతిన ముగిసింది.

థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద సరైన ఆదరణ దక్కకపోయినా, ఓటీటీలో సంచలనం సృష్టించిన సినిమాలు టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. ఇదే సూత్రాన్ని నమ్ముకున్న చిత్ర బృందం డిజిటల్ వేదిక కోసం సరికొత్త ఎడిటింగ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది: థియేటర్లలో విమర్శలకు దారితీసిన అతి హింసాత్మక దృశ్యాలను, అభ్యంతరకర సీన్లను నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ నుండి పూర్తిగా తొలగించారు.

గతంలో నిడివి సమస్య వల్ల ఎడిటింగ్ టేబుల్‌పై పక్కనపెట్టిన కీలకమైన భావోద్వేగ , ఫీల్-గుడ్ సీన్లను తిరిగి సినిమాలో జోడించారు. కథనం మరింత వేగంగా, ఆసక్తికరంగా సాగేలా ఒక ప్రత్యేక డైరెక్టర్స్ కట్ వెర్షన్‌ను ఓటీటీ విక్షకుల కోసం సిద్ధం చేశారు. సినిమాటిక్ క్వాలిటీతో పాటు సవరించిన కథనంతో వస్తున్న ఈ 'రా అండ్ రస్టిక్' డ్రామా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.