Nibba Nibbi OTT Review: ప్రేమికుల వెనుక గ్యాంగ్‌లు.. చేతిలో తుపాకులు, బ్యాగ్‌లో రహస్యం.!

Nibba Nibbi OTT Review: ప్రేమలో ఉన్న జంటలు ఇళ్లనుంచి పారిపోవడం సినిమాల్లో మామూలే. కానీ, అదే జంట చేతిలో తుపాకులు పట్టుకుని, రాష్ట్రంలోని బడా రాజకీయ నాయకుల గుట్టుమట్లు దాగున్న ఒక సీక్రెట్ హార్డ్‌డ్రైవ్‌తో రోడ్డెక్కితే?

G Krishna
Published on: 15 Aug 2026 5:53 PM IST
Nibba Nibbi
X

Nibba Nibbi

Nibba Nibbi OTT Review: ప్రేమలో ఉన్న జంటలు ఇళ్లనుంచి పారిపోవడం సినిమాల్లో మామూలే. కానీ, అదే జంట చేతిలో తుపాకులు పట్టుకుని, రాష్ట్రంలోని బడా రాజకీయ నాయకుల గుట్టుమట్లు దాగున్న ఒక సీక్రెట్ హార్డ్‌డ్రైవ్‌తో రోడ్డెక్కితే? ఒకవైపు ప్రాణాలు తీసేందుకు వెంటపడే ప్రైవేట్ గ్యాంగ్‌లు, మరోవైపు తుపాకుల మోతలు... వీటి మధ్యలోనే తమ స్వార్థం, అనుమానాలు, పిచ్చి ప్రేమతో కొట్టుకునే ప్రేమికులు. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరితమైన, సరికొత్త డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన బెంగాలీ చిత్రం ‘నిబ్బా నిబ్బి’ (Nibba Nibbi). ప్రతి క్షణం థ్రిల్లింగ్‌గా సాగే ఈ డిఫరెంట్ లవ్ అండ్ క్రైమ్ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సీక్రెట్ హార్డ్‌డ్రైవ్... పవర్ ఫుల్ పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు

దేవా, పారో ఇద్దరూ సమాజం వేసే నియమాలు లేదా బాధ్యతలను అస్సలు పట్టించుకోని విచిత్రమైన ప్రేమికులు. తమకు నచ్చినట్లు జీవించడమే తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. అలాంటి సమయంలో ఊహించని విధంగా వారి చేతికి ఒక కీలకమైన హార్డ్‌డ్రైవ్ చిక్కుతుంది. అది సాధారణ పరికరం కాదు... బెంగాల్‌లోని పలువురు పవర్‌ఫుల్ పొలిటీషియన్లు, ప్రభావశీల వ్యక్తుల జాతకాలు, అత్యంత సున్నితమైన రహస్యాలు ఉన్న పరికరం. అది బయటకు వస్తే ఎందరి వికెట్లో పడిపోతాయని గ్రహించిన ఆ పెద్ద మనుషులు, దాన్ని ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రైవేట్ గ్యాంగ్‌లను రంగంలోకి దింపుతారు. అక్కడితో ఈ సాధారణ ప్రేమికుల ప్రయాణం ఒక్కసారిగా ఒక భయంకరమైన పరుగు పందెంగా మారిపోతుంది.

గర్భవతి అయిన ప్రేమికురాలు... వెంటాడే ప్రైవేట్ గ్యాంగ్స్

కథలోని మరో పెద్ద మలుపు ఏంటంటే, పారో గర్భవతిగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కూడా ఆమెను వెంటబెట్టుకుని దేవా బెంగాల్ అంతటా పారిపోవాల్సి వస్తుంది. చేతిలో గన్స్, వెనుక ప్రాణాలు తీసే కిరాయి గ్యాంగ్‌లు ఉన్నప్పటికీ దేవా, పారో మాత్రం తమదైన ‘పిచ్చి’ వైఖరితోనే ప్రవర్థిస్తుంటారు. ఒకవైపు ప్రాణాల మీదికి వస్తుంటే, మరోవైపు వీరిద్దరి మధ్య జరిగే వింత గొడవలు, కోపాలు, అనుమానాలు వినోదాన్ని పంచుతాయి. ఈ ప్రయాణం కేవలం విలన్ల నుంచి తప్పించుకోవడమే కాకుండా, వారి మధ్య ఉన్న టాక్సిక్ అండ్ డిఫరెంట్ రిలేషన్‌షిప్‌ను కూడా పరీక్షించేలా ముందుకు సాగుతుంది.

క్లైమాక్స్ సస్పెన్స్... ఆ పవర్ ఫుల్ లీడర్లకు ఇచ్చిన ఝలక్ ఏంటి?

తమ దగ్గర ఉన్న హార్డ్‌డ్రైవ్ ఎంత ప్రమాదకరమైందో తెలుసుకునే సరికే దేవా, పారోలు చాలా దూరం వచ్చేస్తారు. ఇక వెనక్కి వెళ్లే అవకాశం లేకపోవడంతో వేటగాళ్ల నుంచి తప్పించుకుంటూనే, ప్రతి అడుగు ప్రాణాలకు తెగించి వేస్తారు. భయంకరమైన రక్తపాతం, తుపాకుల మోతల మధ్యలో కూడా వీరి పిచ్చి ప్రేమ వింతగా నవ్వు తెప్పిస్తుంది. చివరికి ఈ జంట ఆ పవర్‌ఫుల్ నాయకులను ఎలా బురిడీ కొట్టించింది? తమ వద్ద ఉన్న రహస్యాలతో ప్రత్యర్థులకే ఎలా ఝలక్ ఇచ్చింది? తమ ప్రాణాలతో పాటు ప్రేమను కాపాడుకోగలిగారా లేదా అనే అంశాలే ఈ చిత్రానికి అసలైన ముగింపుగా నిలుస్తాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?

తథాగత ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ యాక్షన్ రోడ్ జర్నీ ప్రస్తుతం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ రొమాంటిక్ డ్రామాలకు భిన్నంగా గన్స్, క్రైమ్, బ్లాక్ హ్యూమర్ కలబోతగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బెంగాలీ ఆడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story