Nilave Movie: ఓటీటీలో అర్జున్ రెడ్డిలాంటి మూవీ.. మాములు బోల్డ్ కాదు సుమా!

Nilave Movie: అర్జున్ రెడ్డి సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. అయితే తాజాగా అలాంటి ఓ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరు నిల‌వే. ఇంత‌కీ మూవీ ఎలా ఉంది.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పుడు తెలుసుకుందాం.

Mokshith
Published on: 9 April 2026 3:15 PM IST
Nilave Movie
X

 Nilave Movie

Nilave Movie: అర్జున్ రెడ్డి సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. అయితే తాజాగా అలాంటి ఓ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరు నిల‌వే. ఇంత‌కీ మూవీ ఎలా ఉంది.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ ఏంటంటే?

అర్జున్‌ (సౌమిత్ రావు) చిన్నప్పటి నుంచి అనాథ. జీవితంలో తనకు సొంతంగా ఎవరూ లేరనే భావనతో ఒంటరితనంలో పెరుగుతాడు. ఒక యాడ్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తూ తన స్నేహితుడు (వైవా హర్ష) ఇంట్లో ఉంటుంటాడు. బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం అతనిలో ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది.

తన జీవితంలో ఒకరు తోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటాడు. కానీ ప్రేమ, అనుబంధం లాంటివి తన జీవితానికి దూరంగానే ఉంటాయి. ఈ నిరాశ కారణంగా ఒక దశలో ఆత్మహత్యకు ప్ర‌య‌త్నిస్తాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో అతిథి (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది.

ఆమెను చూసిన క్షణం నుంచే అర్జున్‌ జీవితంలో కొత్త మార్పు మొదలవుతుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి దగ్గరయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అతిథి కూడా అర్జున్‌ను ఇష్టపడుతున్నప్పటికీ ప్రేమను పూర్తిగా అంగీకరించడానికి వెనుకడుగు వేస్తుంది. ఆమె గతంలో జరిగిన సంఘటనలు ఇందుకు కారణమని తెలుస్తుంది.

అతిథి గతం ఏమిటి? అర్జున్‌ కలలుగన్న కుటుంబ జీవితం సాధ్యమైందా? చివరికి వీరి ప్రేమ ఏ దిశలో ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది?

ఈ చిత్రం సాధారణ లవ్‌స్టోరీలా కాకుండా కొంచెం భిన్నంగా తెర‌కెక్కించారు. ఒంటరితనంలో మగ్గిపోయిన ఒక యువకుడు, జీవితంపై నమ్మకం కోల్పోయిన ఒక యువతి – వీరిద్దరి భావోద్వేగ ప్రయాణం చుట్టూ కథ నడుస్తుంది.

సినిమా ప్రారంభంలోనే హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి హీరో జీవితంలో హీరోయిన్ ప్రవేశించడంతో కథనం రొమాంటిక్‌గా మారుతుంది. ఇద్దరి పరిచయం పెరిగే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి.

మొదటి భాగంలో వారి మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధం, రెండో భాగంలో హీరోయిన్ గతం చుట్టూ కథ సాగుతుంది. అతిథి గతం గురించి చివరి వరకు పూర్తి వివరాలు చెప్పకుండా ఉత్కంఠ కొన‌సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ కొంచెం భావోద్వేగ దిశగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం మంచి అనుభూతిని ఇస్తుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story