OTT Releases: క్రైమ్ నుంచి కామెడీ వరకు.. ఈ వారం ఓటీటీలో రాబోయేవివే.!
OTT Releases: సెప్టెంబర్ చివరి రోజులతో పాటు అక్టోబర్ ప్రారంభ వారంలో ఓటీటీ వేదికలు సినీ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్లు, కోర్టురూమ్
OTT Releases: క్రైమ్ నుంచి కామెడీ వరకు.. ఈ వారం ఓటీటీలో రాబోయేవివే.!
OTT Releases: సెప్టెంబర్ చివరి రోజులతో పాటు అక్టోబర్ ప్రారంభ వారంలో ఓటీటీ వేదికలు సినీ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్లు, కోర్టురూమ్ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, స్పోర్ట్స్ కథనాలు, యానిమే సిరీస్‌లు , ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలు వంటి వైవిధ్యభరితమైన కంటెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనుంది. హిందీ, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు విదేశీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం (సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు) ప్రముఖ ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
భారతీయ చిత్రాలు, సిరీస్‌లు: డ్రామా నుంచి కామెడీ వరకు
నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియో , జియో హాట్‌స్టార్‌లలో పలు ఆసక్తికర భారతీయ ప్రాజెక్టులు విడుదలవుతున్నాయి. దడక్‌పూర్ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన 'దుపహియా సీజన్ 2' అక్టోబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన లీగల్ డ్రామా 'పూజ మేరీ జాన్' అక్టోబర్ 2న జీ5లో రానుంది. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో బీహార్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ కామెడీ చిత్రం 'ఓహ్ మై డాగ్' అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ నటించిన రొమాంటిక్ డ్రామా '#లవ్' అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో అలరించనుంది. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో సాగే 'మై లడేగా' సెప్టెంబర్ 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో, నివిన్ పౌలీ, మమితా బైజుల మలయాళ రొమాంటిక్ కామెడీ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్' అక్టోబర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. నాలుగు సోదరుల కథతో తెరకెక్కిన బెంగాలీ సిరీస్ 'ఆశీర్వాద్' సెప్టెంబర్ 28 నుంచే జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.
హాలీవుడ్, ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లు అండ్ థ్రిల్లర్లు
అంతర్జాతీయ కంటెంట్ ప్రియుల కోసం పలు ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. జాన్ సేనా, లానా కాండోర్ నటించిన కామెడీ థ్రిల్లర్ 'కయోటి వర్సెస్ ఆక్మే' సెప్టెంబర్ 29న ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ , జీప్లెక్స్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్లోరెన్స్ పగ్ ప్రధాన పాత్రలో కుటుంబ కథాంశంతో రూపొందిన 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్' అక్టోబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. డెన్నిస్ టో నటించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ 'ఇప్ మ్యాన్: కుంగ్ ఫూ లెజెండ్' అక్టోబర్ 2న లైన్స్‌గేట్ ప్లేలో ప్రసారం కానుంది. జైలులో ఉన్న వ్యక్తికి, ఒంటరి తల్లికి మధ్య జరిగే భావోద్వేగ కథనం 'డూయింగ్ లైఫ్' అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రానుండగా, ధనిక జీవితాన్ని నటించే కుటుంబ కథతో రూపొందిన 'క్రేజీ రిచ్, ఇన్‌క్రెడిబ్లీ బ్రోక్' అక్టోబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో అలరించనుంది. అలాగే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ 'మెడుసా సీజన్ 2' సెప్టెంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.
యానిమే, డాక్యుమెంటరీలు అండ్ రియాలిటీ షోలు
యానిమే , డాక్యుమెంటరీ ప్రియుల కోసం ఈ వారం ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. విశేష ప్రజాదరణ పొందిన యానిమే సిరీస్ 'లెగో వన్ పీస్' సెప్టెంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, 'మోనోనోకే ది మూవీ: ఛాప్టర్ III' కూడా సెప్టెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. యానిమే రొమాన్స్ సిరీస్‌లు 'ది రాంపార్ట్స్ ఆఫ్ ఐస్ సీజన్ 2' అక్టోబర్ 1న, 'బ్లూ బాక్స్ సీజన్ 2' అక్టోబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నాయి. పర్వతారోహణ ఆధారిత సాహస డాక్యుమెంటరీ 'ది లాస్ట్ ఫస్ట్: వింటర్ K2' అక్టోబర్ 2న ఆపిల్ టీవీలో విడుదల కానుంది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ 'ది విడోవర్: టిల్ డెత్ డు అజ్ పార్ట్' సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రానుండగా, ఫార్ములా వన్ దిగ్గజం కథతో రూపొందిన 'షుమాకర్ ’94: ది బర్త్ ఆఫ్ ఎ లెజెండ్' అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆరుబయట సాగే సర్వైవల్ రియాలిటీ పోటీ 'అవుట్‌సైడ్' సెప్టెంబర్ 28 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.




