OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు.. ఆ సినిమా మాత్రం అసలు మిస్ కావద్దు

OTT: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు , వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు.

Gagan kumar
Published on: 9 Oct 2026 12:04 PM IST
OTT
X

OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు.. ఆ సినిమా మాత్రం అసలు మిస్ కావద్దు

OTT: చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది! వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన సినిమా ప్రేమికులకు అసలుసలైన వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం థియేటర్లలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు సందడి చేస్తుండగా.. డిజిటల్ బాటలో మాత్రం ఏకంగా 14కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటెంట్ సునామీ రాబోతోంది. ఈ వీకెండ్ మీ బింజ్ వాచింగ్ ప్లాన్‌ను మరింత మజాగా మార్చేయడానికి ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం.

డిజిటల్ యుగంలో వారాంతం వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ చూపు అంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. ఈ వారం థియేటర్లలో శ్రీవిష్ణు నటిస్తున్న‘కామ్రేడ్ కల్యాణ్’, సెన్సేషనల్ హిట్ ‘హనుమాన్ అంశ్’ (తెలుగు) చిత్రాలతో పాటు ‘మయూఖ’, ‘బా..బా.. బ్లాక్ షీప్’ వంటి విభిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్ల సంగతి పక్కన పెడితే, ఓటీటీ ప్రియుల కోసం ఈ వీకెండ్ పండగ వాతావరణమే కనిపిస్తోంది.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓ రేంజ్ లో కంటెంట్ రిలీజ్ అవుతోంది. ముఖ్యంగా కోలీవుడ్ - టాలీవుడ్ కాంబినేషన్‌లో తమిళ నటుడు సూరి, తెలుగు ట్యాలెంటెడ్ హీరో సుహాస్ కలయికలో థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన 'మండాడి' చిత్రం ఇప్పుడు డిజిటల్‌లోకి అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే నేరుగా విడుదలవుతున్న'ఎపిక్' (తెలుగు) సినిమా కూడా ప్రేక్షకులను అలరించనుంది. వీటితో పాటు..

ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 09

రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 09

టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 09

యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 09

హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 09

డాక్టర్ ఎక్స్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 09

100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 10

అమెజాన్ ప్రైమ్

పారిస్ కేఫ్ (తమిళం) – అక్టోబర్ 09

ఖలీఫా (మలయాళం) – అక్టోబర్ 09

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్) – అక్టోబర్ 09

పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ) – అక్టోబర్ 10

విజయనగర్ హిరే (బెంగాలీ) – అక్టోబర్ 10

ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 11

సోనీ లివ్

ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 09

ప్రాంతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్, కొరియన్ డబ్బింగ్ కంటెంట్‌కు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీకిష్టమైన స్నాక్స్ రెడీ చేసుకుని, ఈ వీకెండ్ సినిమాలను ఎంజాయ్ చేయండి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.