OTT Releases : ఈ వారం OTTలో ఫుల్ జాతర.. మూవీస్, సిరీస్‌ల హంగామా.!
OTT Releases : ఈ వారం ఓటీటీ ప్రియులకు వినోదాల విందు లభించనుంది. ఫుట్‌బాల్ ప్రపంచపు దిగ్గజ మేనేజర్ జోస్ మౌరిన్హో బయోపిక్ డాక్యుమెంటరీ, గూఢచర్య కథనాలతో
OTT Releases
OTT Releases : ఈ వారం ఓటీటీ ప్రియులకు వినోదాల విందు లభించనుంది. ఫుట్‌బాల్ ప్రపంచపు దిగ్గజ మేనేజర్ జోస్ మౌరిన్హో బయోపిక్ డాక్యుమెంటరీ, గూఢచర్య కథనాలతో ఆకట్టుకునే 'రీచర్' కొత్త సీజన్, షాహిద్ కపూర్-రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కాక్‌టైల్ 2', అలాగే సంజయ్ దత్ నటించిన 'ఆఖరి సవాల్' వంటి ఎన్నో క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 15 మధ్య వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్న విశేషాలు ఇవే..
సాకర్ విజేత కథ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు
ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం నెట్‌ఫిలెక్స్‌లో ఆగస్టు 11న 'మౌరిన్హో' (Mourinho) అనే మూడు భాగాల డాక్యుమెంటరీ విడుదలవుతోంది. 2004లో ఎఫ్‌సీ పోర్టోతో ఛాంపియన్స్ లీగ్ విజయం సాధించడం నుంచి చెల్సియా, ఇంటర్ మిలాన్, రియల్ మాడ్రిడ్ వంటి దిగ్గజ క్లబ్‌లకు ఆయన అందించిన సేవలు, క్రీడా దిగ్గజాల ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. ఇక ఆగస్టు 12న ప్రైమ్ వీడియోలో 'రీచర్: సీజన్ 4' (Reacher Season 4) ప్రసారం కానుంది. ఫిలడెల్ఫియా సబ్‌వేలో ఓ మహిళ ఎదుర్కొన్న ప్రమాదం వెనుక ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు జాక్ రీచర్ (అలన్ రిచ్‌సన్) చేసే పోరాటం ఇందులో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అదే రోజున ఆపిల్ టీవీ ప్లస్‌లో మెక్సికో మొదటి మహిళా పోలీస్ బలగం కథ ఆధారంగా రూపొందిన 'ఉమెన్ ఇన్ బ్లూ: సీజన్ 2' (Women in Blue Season 2) కూడా అలరించనుంది.
నవలల ఆధారిత డ్రామాలు, నిజజీవిత ఘటనలు
ఆగస్టు 13న నెట్‌ఫ్లిక్స్‌లో 1901 నాటి ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన పీరియాడిక్ డ్రామా 'మై బ్రిలియంట్ కెరీర్' (My Brilliant Career) స్ట్రీమింగ్ కానుంది. సాంప్రదాయ వివాహ వ్యవస్థను నిరాకరించి స్వాతంత్య్రం కోసం పోరాడే రచయిత్రి కథగా ఇది తెరకెక్కింది. అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో 2009 నాటి మెక్సికన్ నిజజీవిత ఘటన ఆధారంగా రూపొందిన 'ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్' (A Child of My Own) డాక్యుమెంటరీ వస్తోంది. కుటుంబ ఒత్తిడితో నకిలీ గర్భధారణ నాటకం ఆడి నేర ప్రపంచంలోకి కూరుకుపోయిన ఒక మహిళ విషాదకర కథ ఇందులో కనిపిస్తుంది. అలాగే కరణ్ జోహార్ హోస్ట్ చేసే మైండ్ గేమ్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్: సీజన్ 2' (The Traitors Season 2) ఆగస్టు 13 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
బాలీవుడ్ మసాలా, హర్రర్, మిలిటరీ మెడికల్ సిరీస్‌లు
ఆగస్టు 14న నెట్‌ఫ్లిక్స్‌లో 'కాక్‌టైల్ 2' (Cocktail 2) విడుదల కానుంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోని జంట నడుమ ఒక స్నేహితురాలు రావడంతో కలిగే వినోదాత్మక మలుపులను చూపించనున్నారు. అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో 'డోంట్ సే గుడ్ లక్' (Don't Say Good Luck) అనే భావోద్వేగ చిత్రం వస్తోంది. ఆగస్టు 14న లయన్స్ గేట్ ప్లేలో సంజయ్ దత్, నమాషి చక్రవర్తిల పొలిటికల్ అకాడమిక్ డ్రామా 'ఆఖరి సవాల్' (Aakhri Sawaal) తో పాటు జానపద అంశాలతో కూడిన హర్రర్ థ్రిల్లర్ 'అరూపి' (Aroopi) స్ట్రీమింగ్ కానున్నాయి. చివరగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జియో హాట్‌స్టార్‌లో ఉరి యుద్ధ ప్రాంతంలోని ఆర్మీ వైద్యుల త్యాగాల ఆధారంగా నిర్మించిన '108 బేస్ హాస్పిటల్ - ఉరి' (108 Base Hospital - Uri) ప్రసారం కానుంది.




