OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు!

OTT Releases: పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుండగా, మరిన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Naresh.k
Published on: 16 April 2026 10:57 AM IST
OTT Releases
X

OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు!

Ustaad Bhagat Singh: వేసవి సెలవులు మొదలయ్యాయి.. పిల్లలకు హాలిడేస్, పెద్దలకు వినోదం. ఈ వారం ఓటీటీ ప్రియులకు అసలైన పండగ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా ఇలా అన్ని ప్లాట్‌ఫారమ్స్ వందకు పైగా కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బిగ్ ఫిలింస్ నుంచి క్రేజీ వెబ్ సిరీస్‌ల వరకు ఈ వారం లిస్ట్ చాలా లెంగ్తీగా ఉంది. థియేటర్లలో ఈ వారం చిన్న సినిమాలు సందడి చేస్తున్నా, ఓటీటీలో మాత్రం భారీ సినిమాలు క్యూ కట్టాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. దీనితో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన టైమ్ లూప్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్' ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

నెట్‌ఫ్లిక్స్ ఈ వారం హెవీ లోడ్‌తో వస్తోంది. యాక్షన్, డ్రామాతో పాటు భారీ క్రీడా ఈవెంట్ కూడా ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు) – ఏప్రిల్ 16

యూత్ (తెలుగు డబ్బింగ్) – ఏప్రిల్ 16

WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్) – ఏప్రిల్ 16

టోస్టర్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 15

దో దివానే షెహర్ మే (హిందీ) – ఏప్రిల్ 17

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 16

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):

యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 13

మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఏప్రిల్ 17

ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) – ఏప్రిల్ 13

డిస్నీ+ హాట్‌స్టార్ (Hotstar):

సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్) – ఏప్రిల్ 15 (మస్ట్ వాచ్ టైమ్ లూప్ మూవీ)

ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) – ఏప్రిల్ 17

ఆహా (Aha):

పోచమ్మ (తెలుగు సిరీస్) – ఏప్రిల్ 17

థియేటర్లలో పరిస్థితి ఇది

ఈ వారం థియేటర్లలో 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్' వంటి చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలపై పెద్దగా బజ్ లేకపోవడంతో, మెజారిటీ ప్రేక్షకులు ఓటీటీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

Naresh.k

Naresh.k

Next Story