Weekend OTT Releases: OTTలో ఈ వారం సందడే సందడి.. మిస్ కాకూడని సినిమాలివే!
Weekend OTT Releases: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో జాతర మొదలైంది. థ్రిల్లర్స్, హారర్-కామెడీల నుండి యాక్షన్ డ్రామాల వరకు.
Weekend OTT Releases: OTTలో ఈ వారం సందడే సందడి.. మిస్ కాకూడని సినిమాలివే!
Weekend OTT Releases: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో వినోదాల జాతర మొదలైంది. థ్రిల్లర్స్, హారర్-కామెడీల నుండి యాక్షన్ డ్రామాల వరకు అన్ని భాషల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. మరి ఈ వారం ఏ ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ వారం ప్రైమ్ వీడియోలో భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. నేరుగా చూసే వాటితో పాటు రెంటల్ పద్ధతిలో కూడా కొన్ని క్రేజీ హాలీవుడ్ చిత్రాలను ఉంచారు. ఇందులో తెలుగు సినిమాల విషయానికి వస్తే 'వీరభద్రుడు', 'రమణి కల్యాణం' చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ చిత్రం 'కరుప్పు' కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సస్పెన్స్ ఇష్టపడే వారి కోసం 'రాఖ్' అనే హిందీ, తమిళ, తెలుగు వెబ్ సిరీస్‌తో పాటు,
'ఆర్.ఎల్. స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్', 'ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్: వెల్‌కమ్ టు బారీస్ బే' వంటి ఇంగ్లీష్ సిరీస్‌లను తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చారు. మలయాళంలో 'పొంగలి', కన్నడలో 'నాను కరుణాకర' చిత్రాలు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రెంటల్ (Rent) విభాగంలో మైఖేల్, లెట్స్ లవ్, మారమ, మోర్టల్ కాంబాట్ II, నెగ్లెక్టెడ్, బాడ్‌లాండ్ రైజింగ్, బ్లూ ఫిల్మ్, బ్రోకెన్ ల్యాండ్, క్రాకెన్, శాకరిన్ , దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ వంటి ఇంగ్లీష్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
నెట్‌ఫ్లిక్స్ ఈసారి హారర్, సస్పెన్స్ లవర్స్‌ను టార్గెట్ చేస్తూ విభిన్నమైన ఇంటర్నేషనల్ కంటెంట్‌ను రంగంలోకి దించింది. హిందీలో హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' స్ట్రీమింగ్ అవుతుండగా, అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం 'అవుట్‌లాస్ట్: ది జంగిల్' వెబ్ సిరీస్ ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అలాగే 'ది పాలిగామిస్ట్' అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, జులు భాషల్లో విడుదల చేశారు. ఇంటర్నేషనల్ సినిమాల విషయానికి వస్తే పోలిష్ చిత్రం 'కలర్స్ ఆఫ్ ఈవిల్: బ్లాక్', థాయ్ సిరీస్ 'ది ఈవిల్ లాయర్'తో పాటు ఇంగ్లీష్ చిత్రం 'ఐ యామ్ ఫ్రాంకెల్డా' నెట్‌ఫ్లిక్స్ లో సందడి చేస్తున్నాయి.
ఆహా వీడియో & ఈటీవీ విన్ (Aha Video & ETV Win)
తెలుగు కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వీకెండ్ సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియోలో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'ష్… సీజన్ 3' లోని మొదటి రెండు ఎపిసోడ్లు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు ఈటీవీ విన్ లో 'రమణి కల్యాణం' సినిమాతో పాటు, సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'సెకండ్ మ్యారేజ్' అనే తెలుగు వెబ్ సిరీస్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
సన్ నెక్స్ట్, జియో హాట్‌స్టార్ & జీ5 (SunNXT, JioHotstar, Zee5)
దక్షిణాది భాషల చిత్రాలతో పాటు పాన్ ఇండియా కంటెంట్‌కు ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌లో మంచి ఆప్షన్స్ లభిస్తున్నాయి. సన్ నెక్స్ట్ లో తెలుగు చిత్రం 'రమణి కల్యాణం'తో పాటు కన్నడ సినిమా 'శాలివాహన శాఖే' స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక జియో హాట్‌స్టార్ లో మోస్ట్ అవేటెడ్ చిత్రం 'దృఢం' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కన్నడ సినిమా ప్రియుల కోసం జీ5 లో 'వికల్ప' అనే చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర హాలీవుడ్ ప్లాట్‌ఫామ్స్
వరల్డ్ క్లాస్ హాలీవుడ్ కంటెంట్ , హారర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మరికొన్ని క్రేజీ ఆప్షన్స్ కూడా ఈ వీకెండ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ హెచ్‌బీఓ మాక్స్ (HBO Max) లో 'దే విల్ కిల్ యూ' అనే హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా, లయన్స్ గేట్ ప్లే (LionsGate Play) లో రొమాంటిక్ డ్రామా 'విక్కీ క్రిస్టినా బార్సిలోనా' అందుబాటులో ఉంది. అలాగే షడర్ (Shudder) ప్లాట్‌ఫామ్‌లో 'ఫైండ్ యువర్ ఫ్రెండ్స్' అనే ఇంగ్లీష్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో గమనించదగ్గ విశేషం ఏంటంటే.. 'రమణి కల్యాణం' అనే తెలుగు చిత్రం ఒకేసారి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ వంటి మూడు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి విడుదలై డిజిటల్ వీక్షకులను అలరిస్తోంది.




