OTT Releases : ఓటీటీ ప్రియులకు పండగ.. ఒక్కరోజే 8 రిలీజ్‌లు.!

OTT Releases : సినిమా ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ (మే 28) ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సరికొత్త చిత్రాలు సిద్ధమయ్యాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ల నుంచి

G Krishna
Published on: 28 May 2026 6:35 PM IST
ott releases
X

ott releases 

OTT Releases : సినిమా ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ (మే 28) ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సరికొత్త చిత్రాలు సిద్ధమయ్యాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ల నుంచి అడల్ట్ కామెడీ సెటైరికల్ డ్రామాల వరకు విభిన్న జోనర్లలో ఏకంగా 8 సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, మనోరమ మ్యాక్స్ వంటి నాలుగు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఈ సినిమాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా వీటన్నింటిలో నెట్‌ఫ్లిక్స్ ఒక్కదానిలోనే ఐదు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు చిత్రాల భారీ సందడి

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈసారి ప్రేక్షకులకు భారీ విందును అందిస్తోంది. ధనుష్, మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో ఇవాళ అందుబాటులోకి వచ్చింది. అలాగే క్రీడా అభిమానులను ఆకట్టుకునేలా 'ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్' అనే ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ కూడా విడుదలైంది. వీటితో పాటు జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2', తెలుగు డబ్బింగ్‌తో కూడిన ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ 'ది ఫోర్ సీజన్స్ సీజన్ 2', , ఉత్కంఠ రేకెత్తించే ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'డెడ్ మ్యాన్స్ వైర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్పెషల్ అట్రాక్షన్స్

మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో నటించిన 'లీడర్ 2026' సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా వచ్చింది. ఇది తమిళంలో వచ్చిన ఒక అద్భుతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ కాగా, ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇక ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' లో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన హాట్ బ్యూటీ తేజస్విని మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'కాకమ్మ కథలు సీజన్ 3' ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతూ వినోదాన్ని పంచుతోంది.

మనోరమ మ్యాక్స్‌లో బోల్డ్ అండ్ సోషల్ సెటైర్

మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ఆసక్తికరమైన సినిమా విడుదలైంది. 'స్పా' పేరుతో వచ్చిన ఈ మలయాళ చిత్రం అడల్ట్ కామెడీ , సోషల్ సెటైర్ డ్రామాగా తెరకెక్కింది. సమాజంలోని కొన్ని కోణాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సాగే ఈ బోల్డ్ మూవీ ఓటీటీ వీక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు నాలుగు ఇంట్రెస్టింగ్ ఛాయిస్‌లు

ఈ వారం విడుదలైన మొత్తం 8 సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా నాలుగు ఇంట్రెస్టింగ్ ఛాయిస్‌లు లభించాయి. 'కర', 'లీడర్ 2026', 'ది ఫోర్ సీజన్స్ సీజన్ 2' చిత్రాలు తెలుగు డబ్బింగ్‌తో లభిస్తుండగా, 'కాకమ్మ కథలు సీజన్ 3' నేరుగా తెలుగులోనే అలరిస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ గురువారం థ్రిల్లర్ లవర్స్ నుంచి కామెడీ ప్రియుల వరకు అందరికీ నచ్చేలా ఓటీటీలు సరికొత్త కంటెంట్‌ను సిద్ధం చేశాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story