River Series : చనిపోయిన వాళ్లతో మాట్లాడే పోలీస్.. ట్విస్టులే ట్విస్టులు.!
River Series : ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్స్‌లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా సరే.. ఆడియన్స్ బాగా ఇష్టపడతారు...
river-series
River Series : ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్స్‌లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా సరే.. ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంటెన్స్ గా, గ్రిప్పింగ్ గా ఉంటే.. వ్యూయర్ షిప్ అంతలా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సైకలాజికల్ క్రైమ్ సిరీస్ మాత్రం వాటన్నిటికంటే చాలా డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. జనరల్ గా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అనగానే ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు, కార్ చేజింగ్‌లు, గన్ ఫైట్స్ లాంటివి ఇందులో పెద్దగా కనిపించవు.
మనకి బాగా కావాల్సిన వాళ్ళు, క్లోజ్ పర్సన్స్ హఠాత్తుగా దూరం అయినప్పుడు మనసు ఎంతలా తల్లడిల్లిపోతుంది, ఆ పెయిన్ నుంచి ఒక మనిషి ఎలా బయటపడతాడు అనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చూపించారు. వీటన్నిటితో పాటు హీరో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతూ మర్డర్ మిస్టరీని ఛేదించే ఒక విచిత్రమైన స్క్రీన్‌ప్లేతో ఈ సిరీస్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ క్రైమ్ సిరీస్ పేరు ‘రివర్’ (River). ఎమ్మీ అవార్డు విన్నర్, పాపులర్ బ్రిటిష్ స్క్రీన్‌రైటర్ అబి మోర్గాన్ రాసిన స్క్రిప్ట్ ఈ సిరీస్‌కు మెయిన్ పిల్లర్ లా నిలిచింది. 2015 లో రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో మెయిన్ క్యారెక్టర్ 'జాన్ రివర్'గా స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, 'స్టీవీ'గా నికోలా వాకర్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో అదరగొట్టారు.
కేవలం 6 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్న ఈ లిమిటెడ్ సిరీస్‌కు వరల్డ్ వైడ్ గా క్రిటిక్స్ నుండి భారీ ప్రశంసలు దక్కాయి. పాపులర్ రివ్యూ వెబ్‌సైట్ ఐఎమ్‌డీబీ (IMDb) లో దీనికి 8.0/10 రేటింగ్ ఉంది. అలాగే రోటెన్ టొమాటోస్ (Rotten Tomatoes) లో ఏకంగా 95% క్రిటిక్స్ స్కోర్ సాధించి ఇదొక మాస్టర్‌పీస్‌గా నిలిచింది. ముఖ్యంగా లీడ్ రోల్ చేసిన స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ పర్ఫార్మెన్స్ కు ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు వచ్చాయి. ఈ సిరీస్ ప్రస్తుతం మనకి నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
ట్విస్టులతో సాగే అసలు స్టోరీ ఏంటంటే..
లండన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాన్ రివర్ అనే ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ ఉంటాడు. అంతా బాగానే సాగుతుందనుకున్న టైమ్‌లో.. ఒక రోజు అతని కళ్ల ముందే అతని బెస్ట్ ఫ్రెండ్, పోలీస్ పార్ట్‌నర్ అయిన స్టీవీని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కార్లో వచ్చి దారుణంగా కాల్చి చంపేస్తారు. తన కళ్ల ముందే ప్రాణస్నేహితురాలు ప్రాణాలు కోల్పోవడంతో రివర్ ఆ షాక్ నుంచి అస్సలు కోలుకోలేకపోతాడు.
దీంతో అతనికి ఒక విచిత్రమైన మానసిక సమస్య (హాలూసినేషన్) మొదలవుతుంది. చనిపోయిన స్టీవీ ఏదో దెయ్యంలా కాకుండా, ఒక నార్మల్ మనిషిలాగే రివర్‌కి కంటికి కనిపిస్తూ, పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు భ్రమ కలుగుతుంది. ఆమెతో కలిసి రివర్ నార్మల్ గా డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంటాడు.
చివరి వరకు ఉత్కంఠ రేపే సస్పెన్స్.!
తనకున్న ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ గనుక బయటపడితే, అందరూ తనకు పిచ్చి అనుకుంటారని, ఉద్యోగం కూడా ఊడిపోతుందని రివర్ భయపడతాడు. అందుకే ఈ విషయాన్ని తన పై అధికారులకి తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాడు. అదే టైమ్‌లో స్టీవీని చంపిన అసలు హంతకుడు ఎవరో కనిపెట్టే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు జాన్.
ఇక స్టీవీ మర్డర్ మిస్టరీని వెతికే కొద్దీ రివర్‌కి ఎన్నో ఊహించని షాకింగ్ నిజాలు, సీక్రెట్స్ తెలుస్తాయి. ఆ ట్విస్టులు చూస్తే ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. మరి ఆ మైండ్ బెండింగ్ ట్విస్టులు ఏంటి? అసలు స్టీవీని ఎవరు, ఎందుకు చంపారు? ఇన్వెస్టిగేషన్‌లో జాన్ తెలుసుకున్న ఆ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ నిజాలు ఏంటి? చివరకు ఈ కథకు ఎలాంటి ఎమోషనల్ ముగింపు దొరికింది? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను ఖచ్చితంగా వాచ్ చేయాల్సిందే..




