OTT : ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ థ్రిల్లర్

OTT : థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించిన సంచలన తమిళ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కరుప్పు' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Naresh.k
Updated on: 12 Jun 2026 11:09 AM IST
OTT
X

OTT : ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ థ్రిల్లర్

Karuppu OTT Release : వీకెండ్ వచ్చేసింది.. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా ఓటీటీ ప్రియుల కోసం పలు కొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేయడానికి వచ్చేసాయి. అయితే, వాటన్నింటిలోకి ఈ వారం ఓటీటీని షేక్ చేయడానికి ఒక స్పెషల్ మూవీ డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించిన ఒక సంచలన తమిళ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు ఒరిజినల్ వెర్షన్ తో పాటు థియేటర్లలో పూనకాలు తెప్పించిన తెలుగు వెర్షన్‌లోనూ ఓటీటీలోకి వచ్చేసింది.

వర్సటైల్ యాక్టర్ సూర్య ప్రధాన పాత్రలో, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కరుప్పు' సినిమా గురించి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గుండెల్ని పిండేసే ఎమోషన్, ఒళ్ళు గగుర్పొడిచే ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక తండ్రి తన అనారోగ్యంతో ఉన్న కూతురికి వైద్యం చేయించడం కోసం హైదరాబాద్‌కు వస్తాడు. కానీ, దురదృష్టవశాత్తు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగగానే దొంగలు వారిపై దాడి చేసి, కూతురి ఆపరేషన్ కోసం తెచ్చిన 60 సవర్ల బంగారాన్ని దోచుకెళ్తారు. ఆ తండ్రి పోలీసులను ఆశ్రయిస్తే.. వారు కేవలం 45 సవర్ల బంగారాన్ని మాత్రమే రికవరీ చేసి, దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ద్వారానే తీసుకోవాలని చెబుతారు.

ఆ తర్వాత ఆ తండ్రీకూతుళ్లు.. బేబీ కృష్ణ అనే పక్కా కమర్షియల్ లాయర్‌ను కలుస్తారు. ఆ లాయర్ వారి దీన పరిస్థితి తెలిసినా కూడా.. డబ్బు కోసం జడ్జితో చేతులు కలిపి కేసును వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ ఉంటాడు. చివరకు ఆ తండ్రీకూతుళ్లు ఎదురు తిరగడంతో, పోలీసులు రికవరీ చేసిన ఆ కాస్త బంగారం కూడా దక్కకుండా చేస్తానని బెదిరిస్తాడు. దిక్కుతోచని స్థితిలో, ఆ నిస్సహాయుడైన తండ్రి కోర్టు ఆవరణలోనే ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి, కన్నీరు మున్నీరుగా తన కష్టాన్ని తీర్చమని ఆ క్షేత్రపాలకుడిని వేడుకుంటాడు.

మరి ఆ భక్తుడి పిలుపు అందుకొని.. సాక్షాత్తూ ఆ వీరభద్రుడే భూమి మీదికి వస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఆ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడింది? ఆ తండ్రీకూతుళ్లకు న్యాయం జరిగిందా? అనేదే ఈ సినిమా సస్పెన్స్ అండ్ యాక్షన్ క్లైమాక్స్. థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించిన ఈ సరికొత్త ఫాంటసీ డ్రామాను మీరు ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సో.. ఈ వీకెండ్‌కు ఒక పక్కా విజువల్ ట్రీట్ కావాలనుకుంటే 'వీరభద్రుడు' సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.






Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story