ఓటీటీలోకి సమంత 'మా ఇంటి బంగారం'..

Maa Inti Bangaram: సమంత లీడ్ రోల్‌లో నటించి, తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'పై నిర్మించిన లేటెస్ట్ సెన్సేషన్ 'మా ఇంటి బంగారం'.

Srinivas Rao
Published on: 13 July 2026 8:10 AM IST
Maa Inti Bangaram
X

ఓటీటీలోకి సమంత 'మా ఇంటి బంగారం'..

Maa Inti Bangaram: సమంత లీడ్ రోల్‌లో నటించి, తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'పై నిర్మించిన లేటెస్ట్ సెన్సేషన్ 'మా ఇంటి బంగారం'. బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తున్న ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియోహాట్‌స్టార్' దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. జూలై 17, 2026 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలవుతున్నా, సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే త్వరలోనే ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాజ్ నిడిమోరు క్రియేటివ్ విజన్, నందిని రెడ్డి దర్శకత్వ ప్రతిభ, అలాగే సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’, డిజిటల్ తెరపై ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story