Shweta Tiwari : 'ఫస్ట్ హజ్బెండ్‌ని చీట్ చేస్తూ నేనే పట్టుకున్నా'.. 'ద ట్రేటర్స్ 2'లో శ్వేతా సంచలనం..!

Shweta Tiwari : పాపులర్ రియాలిటీ షో 'ద ట్రేటర్స్' (The Traitors) సీజన్ 2 గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సూపర్ హిట్ షో ఆగస్టు 13, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ

G Krishna
Published on: 7 Aug 2026 6:06 PM IST
Shweta Tiwari : ఫస్ట్ హజ్బెండ్‌ని చీట్ చేస్తూ నేనే పట్టుకున్నా.. ద ట్రేటర్స్ 2లో శ్వేతా సంచలనం..!
X

Shweta Tiwari : పాపులర్ రియాలిటీ షో 'ద ట్రేటర్స్' (The Traitors) సీజన్ 2 గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సూపర్ హిట్ షో ఆగస్టు 13, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మల్లికా షెరావత్, మునావర్ ఫరూకీ, శ్వేతా తివారి, రియా చక్రవర్తి సహా మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఇటీవల విడుదలైన ఈ షో కొత్త ప్రోమో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా సీనియర్ నటి శ్వేతా తివారి తన మాజీ భర్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రోమోలో కరణ్ ప్రశ్న.. శ్వేతా షాకింగ్ రిప్లై..

తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ కరణ్ జోహార్‌తో కలిసి ఒకే టేబుల్‌పై కూర్చుని కనిపిస్తారు. "గత సీజన్ చూసిన తర్వాత కూడా ఇక్కడికి రావడానికి ధైర్యం చేశారు.. నిజంగా మీకు గట్స్ ఉన్నాయి" అని కరణ్ అనగా, "ఈ రియాలిటీ షోలో ఫేక్‌గా నటించడమే ముఖ్యం" అని మునావర్ ఫరూకీ అంటాడు. ఆ తర్వాత మల్లికా షెరావత్ స్పందిస్తూ.. "ఈ షోలో నిజం కంటే అవతలి వారిని నమ్మించడమే ముఖ్యం" అని చెబుతుంది.

ఈ క్రమంలో కరణ్ జోహార్, శ్వేతా తివారి వైపు చూస్తూ.. "అబద్ధాలు కనిపెట్టడంలో నువ్వేమీ అంత దిట్టవి కాదేమో" అని వ్యాఖ్యానించగా, శ్వేతా తక్షణమే స్పందిస్తూ.. "నా భర్త నన్ను చీట్ చేస్తుండగా నేనే స్వయంగా పట్టుకున్నాను" అంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ మాట వినగానే పక్కనే ఉన్న క్రిస్టల్ సహా మిగిలిన కంటెస్టెంట్లు షాక్‌కు గురయ్యారు.

శ్వేతా తివారి రెండు పెళ్లిళ్లు.. వివాదాల నేపథ్యం

శ్వేతా తివారి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆమె గతంలో ఇద్దరిని వివాహం చేసుకోగా, ఆ రెండు బంధాలు విడాకులతోనే ముగిశాయి. శ్వేతా మొదటి భర్త రాజా చౌదరి కాగా, వీరి పెళ్లి 1998లో జరిగింది. 2007లో విడిపోయిన వీరు 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి పాలక్ తివారి అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లాడిన శ్వేతా, మనస్పర్థల కారణంగా 2019లో అతడి నుంచి కూడా విడిపోయింది. వీరికి రేయాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు.

అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గతంలో శ్వేతా తివారి మాజీ భర్తలిద్దరూ కూడా ఆమెపైనే ఎఫైర్ ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు శ్వేతా స్వయంగా తన భర్తే తనను చీట్ చేశాడని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

మైండ్ గేమ్‌లో శ్వేతా నెగ్గుకొస్తుందా?

ప్రస్తుతం శ్వేతా తివారి సినిమాలు, ఓటీటీ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ప్రజాదరణ పొందుతున్నారు. 40 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఫిట్‌గా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచే శ్వేతా, ఇప్పుడు ‘ద ట్రేటర్స్ 2’ వంటి మైండ్ గేమ్‌ రియాలిటీ షోలోకి అడుగుపెట్టడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె తన తెలివితేటలతో ఈ షోలో ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story