Son of Movie: ఓటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ ‘సన్ ఆఫ్’

Son of Movie: సాయి సింహాద్రి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సన్ ఆఫ్’ ఇప్పుడు ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది.

Son of Movie
X

Son of Movie: ఓటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ ‘సన్ ఆఫ్’

Son of Movie: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్ ఆఫ్ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేస్తోంది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాయి సింహాద్రి హీరోగా నటించడంతో పాటు స్వయంగా నిర్మించారు. హీరోయిన్‌గా మీరా రాజ్ నటించగా, తండ్రి పాత్రలో వినోద్ కుమార్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తండ్రి-కొడుకు మధ్య భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి భాగంలో పల్లెటూరి నేపథ్యం, సరదా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించగా, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రెండో భాగంలో ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను బలంగా చూపిస్తూ క్లైమాక్స్‌ను ప్రభావవంతంగా తెరకెక్కించారు.

సినిమా నిర్మాణ విలువలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఎడిటింగ్‌ను అమర్ నాథ్ నిర్వహించగా, సంగీతాన్ని రిషి ఎం అందించారు. సినిమాటోగ్రఫీని VRK నాయుడు సమర్థంగా హ్యాండిల్ చేశారు.

థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో కూడా మంచి స్పందన పొందుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

నటీనటులు: వినోద్ కుమార్, సాయి సింహాద్రి, మీరా రాజ్, విష్ణు ఇంటూరి తదితరులు

దర్శకత్వం: బత్తుల సతీష్

నిర్మాత: సాయి సింహాద్రి

సంగీతం: రిషి ఎం

ఎడిటింగ్: అమర్ నాథ్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story