థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘ఎం4ఎం’.. జూన్ 19 నుంచి ఒకేసారి 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

M4M: థియేటర్లలో భారీ రేటింగ్స్‌తో దూసుకెళ్లిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.

Arun Chilukuri
Published on: 2 Jun 2026 5:40 PM IST
M4M
X

థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘ఎం4ఎం’.. జూన్ 19 నుంచి ఒకేసారి 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

M4M: చిత్ర పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. బలమైన కథ, ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు అందుకున్న అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ చిత్రమే “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)”. మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత, “ఎం4ఎం” భారీ స్థాయిలో డిజిటల్ ప్రీమియర్‌కు లైనప్ అయింది. జూన్ 19 నుంచి ఈ చిత్రం ఒకేసారి పలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Airtel Xstream), జియోటీవీ (JioTV), టాటా ప్లే బింజ్ (Tata Play Binge) ఇంట్లోనే కూర్చుని క్వాలిటీ థ్రిల్లర్ సినిమాలను ఆస్వాదించాలనుకునే ఓటీటీ ప్రియులకు ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఛాయిస్ కానుంది.

దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఐఎండీబీ (IMDb)లో 9.1/10, బుక్ మై షో (BookMyShow)లో 9.6/10 లాంటి అసాధారణ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ దినపత్రికలు, వినోద వెబ్‌సైట్లు కూడా ఈ సినిమాకు 5 కి 3.5 రేటింగ్స్ ఇచ్చి కొనియాడాయి. టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ (అమెరికా)లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma), సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ 'రాధ' పాత్రలో జో శర్మ చూపించిన నటన, హావభావాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తన సహజ నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు చేస్తూ, ఫేమస్ పెయింటింగ్స్ తరహాలో శవాలను అమర్చే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సస్పెన్స్, మిస్టరీ, డ్రామాను దర్శకుడు మోహన్ వడ్లపట్ల అద్భుతంగా మిక్స్ చేశారు. బలమైన స్క్రీన్‌ప్లేతో చివరి నిమిషం వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకుడి ఊహకు అందకుండా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. షాకింగ్ క్లైమాక్స్, ఉత్కంఠభరిత సన్నివేశాలు థ్రిల్లర్ అభిమానులను ఖచ్చితంగా కట్టిపడేస్తాయి. మిస్ అవ్వకుండా జూన్ 19న మీ ఫేవరెట్ ఓటీటీలో చూసేయండి!

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story