OTT Release: దళపతి విజయ్ జననాయగన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
OTT Release: దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమాగా వచ్చిన 'జననాయగన్' ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది.
OTT Release: దళపతి విజయ్ జననాయగన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
OTT Release: దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమాగా వచ్చిన 'జననాయగన్' ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. జీ5 ప్లాట్ఫామ్లో ఆగస్టు 21 నుంచి స్ట్రీమ్ కానుంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమాగా వస్తున్న 'జననాయగన్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పూర్తిగా సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 దక్కించుకుంది. ఈ మేరకు ఆగస్టు 21 నుంచి తమ ప్లాట్ఫామ్లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్లు జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. వివిధ భాషలకు చెందిన విజయ్ అభిమానులు ఈ చిత్రాన్ని ఎవరికి నచ్చిన భాషలో వారు వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన ప్రముఖ నటి పూజ హెగ్డే కథానాయికగా నటించింది.
వీరితో పాటు ఈ చిత్రంలో యువ నటి మమిత బైజు, సీనియర్ నటీనటులు ప్రియమణి, ప్రకాష్ రాజ్ అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ తన సినీ కెరీర్లో చివరి సినిమాగా నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి కొత్త రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.




