Sapne Vs Everyone : ప్రపంచంలో No.1 వెబ్ సిరీస్.. TVF కొత్త రికార్డ్.!
Sapne Vs Everyone : ఓటీటీ (OTT) ప్రపంచంలో 'ది వైరల్ ఫీవర్' (TVF) క్రియేట్ చేసే వెబ్ సిరీస్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. 'పర్మనెంట్ రూమ్‌మేట్స్'
Sapne Vs Everyone
Sapne Vs Everyone : ఓటీటీ (OTT) ప్రపంచంలో 'ది వైరల్ ఫీవర్' (TVF) క్రియేట్ చేసే వెబ్ సిరీస్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. 'పర్మనెంట్ రూమ్‌మేట్స్' నుండి నిన్నమొన్నటి 'పంచాయత్' వరకు, విభిన్నమైన కథలతో సమాజానికి దగ్గరగా ఉండే సిరీస్‌లను అందిస్తూ TVF ఓటీటీపై తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వచ్చిన ఒక వెబ్ సిరీస్ ప్రపంచంలోనే అత్యధిక ఐఎమ్‌డిబి (IMDb) రేటింగ్ సాధించిన సిరీస్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌కు మైండ్ బ్లోయింగ్ రేటింగ్స్ రావడం విశేషం. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ప్రస్తుతం ఓటీటీలో మస్ట్ వాచ్ లిస్ట్‌లో చేరిపోయింది. దీని రికార్డు బ్రేకింగ్ సక్సెస్‌ను అందుకోవడం ఏ ఇతర సిరీస్‌కైనా అంత సులువు కాదు.
వరల్డ్ హయ్యెస్ట్ రేటెడ్ సిరీస్‌గా రికార్డ్
మనం మాట్లాడుకుంటున్న ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మరేదో కాదు.. 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2' (Sapne Vs Everyone Season 2). అంబరీష్ వర్మ దర్శకత్వంలో, ఆయనే స్వయంగా కథ అందిస్తూ TVF బ్యానర్‌పై ఈ సిరీస్‌ను రూపొందించారు. 2023లో వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ 5 ఎపిసోడ్లతో అప్పట్లోనే 9 కంటే ఎక్కువ IMDb రేటింగ్‌తో భారీ ప్రజాదరణ పొందింది. అయితే, మూడు సంవత్సరాల తర్వాత మే 2026లో వచ్చిన ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్’ సీజన్ 2 అంతకు మించిన రికార్డులను సృష్టిస్తోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యధిక IMDb రేటింగ్ సాధించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. దీని ప్రతి ఎపిసోడ్‌కు సగటున 9.7 రేటింగ్ రావడం గమనార్హం.
ఎపిసోడ్ల వారీగా రేటింగ్స్ వివరాలు
మొదటి సీజన్‌లో కూడా ఐదు ఎపిసోడ్లు ఉండగా.. అందులో మొదటి ఎపిసోడ్‌కు 9.4, రెండో ఎపిసోడ్‌కు 9.5, మూడు , నాల్గో ఎపిసోడ్‌లకు 9.6, ఇక చివరి ఐదో ఎపిసోడ్‌కు 9.7 రేటింగ్ లభించాయి. అయితే మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్‌కు కస్టమర్ల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీని రేటింగ్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సీజన్ 2 లోని మొదటి నాలుగు ఎపిసోడ్లు వరుసగా 9.7 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, క్లైమాక్స్ ఎపిసోడ్ అయిన ఐదో ఎపిసోడ్ ఏకంగా 9.8 రేటింగ్ సాధించి తహల్కా సృష్టించింది.
ఆకట్టుకునే సిరీస్ కథాంశం
'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' కథ అంతా తమ కలల కోసం, ఆశయాల కోసం ప్రాణమిచ్చే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. సమాంతరంగా సాగే వీరిద్దరి కథల ద్వారా సమాజంలోనికఠినమైన వ్యవస్థలు, వారు పడే ఆరాటం, జీవితంలో విజయం సాధించడానికి వారు చెల్లించాల్సిన భారీ మూల్యం వంటి అంశాలను చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఈ సిరీస్‌లో పరమ్‌వీర్ సింగ్, అంబరీష్ వర్మ, విజయంత్ కోహ్లీ, అభిషేక్ చౌహాన్, కిరన్‌దీప్ కౌర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించి తమ అద్భుత నటనతో మెప్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ డ్రామా ఇది.




