Vadh 2 Movie: ఈ వారం ఓటీటీలో టాప్ 1 మూవీ ఇదే.. త‌ప్ప‌క చూడాల్సిన క్రైమ్ థ్రిల్ల‌ర్

Vadh 2 Movie: హిందీ క్రైమ్ థ్రిల్లర్ “వధ్ 2 (Vadh 2)” సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Mokshith
Published on: 5 April 2026 3:12 PM IST
Vadh 2 Movie Review in Telugu Netflix
X

Vadh 2 Movie Review in Telugu

Vadh 2 Movie: హిందీ క్రైమ్ థ్రిల్లర్ “వధ్ 2 (Vadh 2)” సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 3 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం విడుదలైన 24 గంటల్లోనే భారీ స్పందన సాధించింది. ఇంత‌కీ సినిమా క‌థ ఏంటి.? ఏ ఓటీటీలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌ధ్ 2 సినిమా ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్‌లో ‘ధురంధర్ 2’, ‘మర్దానీ 3’ వంటి సినిమాలను దాటేసి నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. వ‌ధ్‌2 సినిమా 2022లో వచ్చిన “వధ్” సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చింది. “వధ్ 2” ఆ చిత్రానికి నేరుగా కొనసాగింపు కాకపోయినా, అదే థీమ్‌ను కొనసాగించే మూవీలాగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా నీనాగుప్తా, సంజయ్ మిశ్రా ఇద్దరూ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే మొదటి భాగంలో చేసిన పాత్రలను మళ్లీ చేయకుండా కొత్త పాత్రల్లో కనిపించడం ప్రత్యేకతగా నిలిచింది.

ఈ సినిమా క‌థేంటి.?

ఈ సినిమా కథ ప్రధానంగా శివపురి జైలు నేపథ్యంగా సాగుతుంది. శంభునాథ్ (సంజయ్ మిశ్రా) – జైలులో పని చేసే వ్యక్తి మంజు (నీనాగుప్తా) – డబుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ. ఈ ఇద్దరి మధ్య జైలు గోడలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా సంభాషణలు జరుగుతాయి. ఆ చిన్న రంధ్రం వారి మధ్య ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మంజుకు అవసరమైన వస్తువులు, ముఖ్యంగా జైలులో కరెన్సీలా మారిన మద్యం వంటి వాటిని శంభునాథ్ అందిస్తుంటాడు. ఈ వ్యవహారం క్రమంగా ఇద్దరి మధ్య ఒక అర్థం చేసుకునే సంబంధంగా మారుతుంది.

కొత్త ఖైదీ రావడంతో కథలో మలుపు

జైలులోకి నైనా (యోగిత బిహాని) అనే కొత్త ఖైదీ వస్తుంది. ఆమెను చూసి కేశవ్ (అక్షయ్ డోగ్రా) అనే ప్రమాదకర ఖైదీ ఆమెపై దృష్టి పెడతాడు. ఇక కొత్త జైలర్ ప్రకాశ్ సింగ్ (కుముద్ మిశ్రా) జైలులో కఠిన నిబంధనలు అమలు చేస్తూ పరిస్థితిని మార్చేస్తాడు. ఈ పరిణామాల మధ్య ఒక్కసారిగా ఒక హత్య జరుగుతుంది. ఆ కేసును ఛేదించడానికి అతీత్ (అమిత్ కె సింగ్) అనే తెలివైన పోలీస్ అధికారి వస్తాడు. అక్కడి నుంచి కథలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమవుతుంది.

నైతిక ప్రశ్నల చుట్టూ తిరిగే కథ

సినిమా ప్రధానంగా ఒక ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. “చెడ్డ‌ మనిషిని చంపితే అది నేరమా? లేక న్యాయమా?” ఈ ప్రశ్న చుట్టూ కథ తిరుగుతుంది. సంజయ్ మిశ్రా పాత్ర హత్యను “వధ్” అని పిలుస్తూ దానికి న్యాయం ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది కథలో నైతిక సంఘర్షణను చూపించే ప్రయత్నం.

ఇక సినిమా చివర్లో వ‌చ్చే ఒక ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ముందుగా చూపించిన చిన్న చిన్న సంఘటనలు చివర్లో కలిపి చూపించడం కథకు కొంత బలం ఇస్తుంది. మొత్తంగా చూస్తే “వధ్ 2” ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story