Vijay Antony: ఓటీటీలోకి వస్తున్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’!

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘వంద దేవుళ్లు’ .

Srinivas Rao
Published on: 25 July 2026 12:52 PM IST
Vijay Antony
X

Vijay Antony: ఓటీటీలోకి వస్తున్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’!

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘వంద దేవుళ్లు’ . నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) తెలుగు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రీమియర్ ప్రకటనను విడుదల చేసింది.

ఆగస్టులో జీ5 వేదికగా స్ట్రీమింగ్..

థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఆగస్టు నెలలో జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే, మేకర్స్ కచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఇటీవల ZEE5లో విడుదలైన ‘పరిమళ & కో’ కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, అదే కోవలో ఈ ‘వంద దేవుళ్లు’ కూడా వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.

కథాంశం … నేపథ్యం

ఈ చిత్రంలో శ్వాసిక విజయ్ ప్రధాన పాత్రలో నటించగా.. భర్తను కోల్పోయి, తన ఇద్దరు పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ మధ్యవయస్కురాలైన ఇల్లాలు కథ ఇది. నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆమె తన జీవితంలో తోడు కోసం (పునర్వివాహం) ఆలోచించడం, ఆ నిర్ణయాన్ని బంధువులు, గ్రామం , సమాజం తీవ్రంగా వ్యతిరేకించడం వంటి ఎమోషనల్ పాయింట్‌పై ఈ సినిమా నడుస్తుంది.

తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని, త్యాగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూనే.. మహిళల వ్యక్తిగత సంతోషం, సమాజపు ఆలోచన ధోరణులను ప్రశ్నించేలా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశి తెరకెక్కించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story