OTT: పోస్ట్ డిలీట్ చేసినా దొరికిపోయిన నెట్‌ఫ్లిక్స్.. రణబాలి OTT డేట్ లీక్!

OTT: విజయ్ దేవరకొండ 'రణబాలి' నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ravi
By Ravi
Published on: 2 Nov 2026 3:42 PM IST
OTT
X

OTT: పోస్ట్ డిలీట్ చేసినా దొరికిపోయిన నెట్‌ఫ్లిక్స్.. రణబాలి OTT డేట్ లీక్!

OTT: విజయ్ దేవరకొండ నటించిన 'రణబాలి' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ SMలో నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఏమైందో ఏమో కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించింది.

కొందరు స్క్రీన్ షాట్లు తీయడంతో విడుదల తేదీ బయటికొచ్చింది. ఈ తేదీపై నెట్‌ఫ్లిక్స్ లేదా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుందని సమాచారం.

అక్టోబర్ 16న రిలీజైన రణబాలి ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా ఈ కలెక్షన్లు సాధించడం విశేషం. ఇది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత వారిద్దరికీ వచ్చిన తొలి థియేట్రికల్ రిలీజ్.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా, బ్రిటిష్ పాలనలో రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కింది. విజయ్ టైటిల్ రోల్‌లో కనిపించగా, రష్మిక జయమ్మ పాత్రలో నటించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించారు. ఈశ్వరి రావు, లాల్, వినోద్ సాగర్, మధునందన్, పొలిమేర కిషోర్ కుమార్ ముఖ్య పాత్రల్లో ఉన్నారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.