ఒక అమాయక కానిస్టేబుల్ 'ఖతర్నాక్' రివెంజ్.. ఓటీటీని షేక్ చేస్తున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్!

ప్రతిరోజూ అవమానాలు, పై అధికారుల వేధింపులు ఎదురైతే ఎలా ఉంటుంది? పని చేసే చోట తోటి మనిషి అనే కనీస గౌరవం కూడా దొరకకపోతే పరిస్థితి ఏంటి? ప్రాణాల మీదకు వస్తే

G Krishna
Published on: 23 May 2026 5:29 PM IST
Warrant
X

Warrant 

ప్రతిరోజూ అవమానాలు, పై అధికారుల వేధింపులు ఎదురైతే ఎలా ఉంటుంది? పని చేసే చోట తోటి మనిషి అనే కనీస గౌరవం కూడా దొరకకపోతే పరిస్థితి ఏంటి? ప్రాణాల మీదకు వస్తే పిల్లి అయినా పులిలా మారుతుంది అంటారు కదా, అచ్చం అలాంటి సిట్యుయేషనే ఇక్కడ కూడా క్రియేట్ అయింది. ఎంత అమాయకంగా ఉన్నా ఓపిక నశించిన రోజున ఎవరైనా సరే ఎదురు తిరగడం ఖాయం. అలా వ్యవస్థపై ఎదురు తిరిగి, తనకు కావలసిన న్యాయాన్ని తానే దక్కించుకున్న ఒక కానిస్టేబుల్ ఇంటెన్స్ కథే ఈ సరికొత్త వెబ్ సిరీస్. సస్పెన్స్, క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త సిరీస్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

జీ5 ఓటీటీలో 'వారెంట్' హంగామా

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హై-వోల్టేజ్ ఒరిజినల్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే 'వారెంట్' (Warrant). గతంలో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘విలంగు’ (Vilangu – 2022) అనే సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ఈ సరికొత్త సిరీస్ తెరకెక్కింది. దీనిని ప్రశాంత్ పాండియరాజ్ క్రియేట్ చేయగా, విగ్నేష్ నటరాజన్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. పోలీసుల అంతర్గత జీవితం, చట్టాలు, ఒక సాధారణ కానిస్టేబుల్ లైఫ్ లో వచ్చిన చేంజెస్ వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 (జీ5) లో ఈ క్రేజీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది.

అవమానాల నుంచి ఎన్‌ఫోర్సర్‌గా.. అసలు కథేంటంటే?

ఈ కథ అంతా ఒక చిన్న పట్టణంలో పని చేసే కోట్టై కరుప్పుసామి అనే అమాయకపు కానిస్టేబుల్ చుట్టూనే తిరుగుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లోయర్ లెవెల్ స్టాఫ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇందులో చాలా ప్రాక్టికల్‌గా చూపించారు. పై అధికారుల నుండి కరుప్పుసామి ప్రతిరోజూ తీవ్రమైన అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరం జరిగే ఈ హింసను భరించి భరించి, ఒకానొక టైంలో అతని ఓపిక కట్టలు తెంచుకుంటుంది. దాంతో అప్పటిదాకా తన లోపల అణచి పెట్టుకున్న కోపం, పగను బయటకు తీసి, మెల్లగా ఒక భయంకరమైన ఎన్‌ఫోర్సర్‌గా మారుతాడు.

ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. డిపార్ట్‌మెంట్‌లో ఎప్పుడో మర్చిపోయిన, పెండింగ్‌లో ఉన్న పాత 'వారెంట్' కేసుల ఫైళ్లను అతను బయటకు తీస్తాడు. కరుప్పుసామి ఒక్కొక్క కేసును వినూత్న రీతిలో ఛేదించడం షురూ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో అతను చట్టాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని నేరస్థుల పట్ల అత్యంత క్రూరంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని ప్రవర్తన చూసిన జనాలు ఇతను చట్టాన్ని కాపాడుతున్నాడా లేక ఆ చట్టానికే పెద్ద ముప్పుగా మారాడా అని భయంతో వణికిపోతారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌లో ఒక కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ అతని జీవితాన్నే కాకుండా మొత్తం పోలీస్ వ్యవస్థను ఎలా కుదిపేసిందనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

ఆకట్టుకునే నటీనటులు.. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్!

ఈ సిరీస్‌లో మెయిన్ లీడ్ కానిస్టేబుల్ కరుప్పుసామి క్యారెక్టర్‌లో ప్రశాంత్ పాండియరాజ్ జీవించేశారనే చెప్పాలి. ఆయనతో పాటు బాలాజీ శక్తివేల్, కాళీ వెంకట్, అరుళ్ దాస్, నమ్రిత తదితరులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ లోపల ఉండే సిస్టమ్ లోపాల గురించి చాలా రియలిస్టిక్‌గా ఈ సిరీస్ లో డిస్కస్ చేశారు. వీటన్నింటికీ తోడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ (Sam C.S.) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలోని ఇంటెన్సిటీని, సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ వీకెండ్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డ్రామాను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ZEE5 లో ఉన్న ఈ 'వారెంట్' సిరీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story