ఓటీటీకి వచ్చేస్తోన్న యోగి బాబు వైవిధ్యమైన కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Kenatha Kanom: కోలీవుడ్ స్టార్ కమెడియన్, వెర్సటైల్ యాక్టర్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ సెటైర్ కామెడీ డ్రామా ‘కెనత్త కానోమ్’.
ఓటీటీకి వచ్చేస్తోన్న యోగి బాబు వైవిధ్యమైన కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Kenatha Kanom: కోలీవుడ్ స్టార్ కమెడియన్, వెర్సటైల్ యాక్టర్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ సెటైర్ కామెడీ డ్రామా ‘కెనత్త కానోమ్’. దివంగత దర్శకుడు సురేష్ సంగయ్య తెరకెక్కించిన ఈ విభిన్నమైన చిత్రం.. థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘జియోహాట్‌స్టార్ వేదికగా జూన్ 15 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.
వినూత్నమైన కథ.. నీళ్ల కోసం తవ్వితే డైనోసార్ గుడ్లు!
తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లోని తీవ్రమైన నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ప్రభుత్వాల వైఫల్యాలు , గ్రామీణ ప్రజల అస్తిత్వాన్ని హాస్యాస్పదంగా, ఆలోచింపజేసేలా ఈ సినిమాలో చూపించారు.
కథేంటంటే: కరవుతో అల్లాడుతున్న ఒక గ్రామంలోని ప్రజలు నీటి సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఒక వాటర్ డివైనర్ (భూగర్భ జలాలను గుర్తించే నిపుణుడు) సహాయం తీసుకుంటారు. ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం.. ఊరి పూజారి మణివాసగం (యోగి బాబు) ఇంటి బయట సరిగ్గా ఒక చోట బావి కోసం తవ్వకం మొదలుపెడతారు.
ట్విస్ట్: అయితే నీళ్లు పడతాయనుకున్న ఆ ప్లేస్‌లో ఊహించని విధంగా పురాతన డైనోసార్ శిలాజాలు (ఎముకలు) బయటపడతాయి. దాంతో సీన్ లోకి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ (పురాతత్వ శాఖ) ఎంట్రీ ఇచ్చి ఆ ఊరిని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత తమ ఊరిని కాపాడుకోవడానికి, నీటి సమస్యను తీర్చుకోవడానికి గ్రామస్థులు ప్రభుత్వంతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
మార్చి 13న థియేటర్ రిలీజ్.. మిక్స్‌డ్ టాక్!
ఈ ఏడాది మార్చి 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. కథాంశం చాలా కొత్తగా, బ్యూరోక్రసీ వైఫల్యాలను ఎండగట్టేలా ఉన్నప్పటికీ.. సినిమా ద్వితీయార్థంలో సైన్స్‌ను పక్కనపెట్టి పాత పద్ధతులను అతిగా రొమాంటిసైజ్ చేయడం, కొన్ని తప్పుడు ఫిలాసఫీల ఆధారంగా సాగడం సినిమా మైనస్‌గా మారిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే యోగి బాబు మార్క్ కామెడీ, కరెంట్ సొసైటీపై వేసిన సెటైర్లు ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించే అవకాశం ఉంది.
సాంకేతిక నిపుణులు
ఆర్‌బి టాకీస్, బాక్స్ ఆఫీస్ స్టూడియో బ్యానర్లపై ఆర్ రమేష్ బాబు, జగన్ భాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో లవ్లిన్ చంద్రశేఖర్, రామకృష్ణన్, రైచెల్ రెబెక్కా, జార్జ్ మరియం, రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా.. వి త్యాగరాజన్ సినిమాటోగ్రఫీ అందించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ క్రేజీ సోషల్ సెటైర్ డ్రామాను జూన్ 15 నుండి జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.




