NBK Birthday Special : బాక్సాఫీస్ సింహం బాలయ్య.. బర్త్ డే స్పెషల్..!

NBK Birthday Special : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్‌ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే 'నటసింహం' నందమూరి బాలకృష్ణ నేడు తన పుట్టినరోజును..

G Krishna
Published on: 10 Jun 2026 4:56 PM IST
NBK Birthday Special : బాక్సాఫీస్ సింహం బాలయ్య.. బర్త్ డే స్పెషల్..!
X

NBK Birthday Special : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్‌ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే 'నటసింహం' నందమూరి బాలకృష్ణ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఐదు దశాబ్దాలుగా వెండితెరపై రారాజులా వెలుగుతున్న బాలయ్య.. నేటికీ అదే జోష్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ‘అఖండ’ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ, వరుసగా వంద కోట్ల క్లబ్ సినిమాలతో మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారు.






బాలకృష్ణ 1974లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వచ్చిన 'తాతమ్మ కల' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన దాదాపు 110 సినిమాల్లో నటించి, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు.



ఒకప్పుడు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న బాలయ్య.. ఈ మధ్యకాలంలో 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించారు. ఈ భారీ బ్లాక్‌బస్టర్ల తర్వాత ఆయన తన పారితోషికాన్ని రూ. 20 నుండి రూ. 30 కోట్లకు పెంచేసినట్లు టాలీవుడ్ సమాచారం.






హీరోగానే కాకుండా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న బాలకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న ఆయన సొంత ఇంటి విలువనే దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. దీనితో పాటు ఎన్నో ప్రాంతాల్లో విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు , ప్రముఖ రామకృష్ణ, ఎన్టీఆర్ స్టూడియోలలో భారీగా భాగస్వామ్యం ఉంది.





బాలయ్య వద్ద ఉన్న బంగారం, వెండి లెక్కలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకు దాదాపు 6 కిలోల బంగారం, 156 కిలోల వెండి, అలాగే 580 క్యారెట్ల విలువైన వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన గ్యారేజీలో BMW 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ వంటి ఎన్నో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.





ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ సీనియర్ హీరో. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో 'NBK 111' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'NBK 112' ఇటీవల అనౌన్స్ అవ్వగా.. దిల్ రాజు నిర్మాణంలో వశిష్ట డైరెక్షన్‌లో ఒక సినిమా, అలాగే ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘జై అఖండ’ (అఖండ 3) చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ రియల్ లైఫ్ హీరోగా బాలకృష్ణ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ రోజు కూడా వారి పిల్లల సమక్షంలోనే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story