Beetroot Hair Pack : జుట్టు పట్టులా మెరవాలంటే.. ఈ బీట్రూట్ చిట్కా ట్రై చేయాలిందే..!
Beetroot Hair Pack : కాలుష్యం, ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, పలచబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
Beetroot-Hair-Pack-
Beetroot Hair Pack : కాలుష్యం, ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, పలచబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి కేశ సమస్యలన్నింటికీ ఇంట్లోనే సులభంగా దొరికే బీట్రూట్ ఒక అద్భుతమైన సహజ పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్ , పొటాషియం వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, కొత్త జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. ఈ వెబ్ స్టోరీలో బీట్రూట్తో చేసుకొనే సింపుల్ హెయిర్ ప్యాక్స్ , వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బీట్రూట్లో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, పొటాషియం , శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
పబ్మెడ్ సెంట్రల్ అధ్యయనాల ప్రకారం, బీట్రూట్లోని నైట్రేట్లు తలలో రక్త ప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
తీవ్రమైన మానసిక లేదా శారీరక ఒత్తిడి వల్ల వచ్చే జుట్టు రాలడం సమస్యను బీట్రూట్ రసం క్రమం తప్పకుండా వాడటం ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ఒక కప్పు బీట్రూట్ రసంలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి, జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి.
ఎండిపోయిన, నిర్జీవంగా మారిన జుట్టును పట్టులా మృదువుగా మార్చడానికి , జుట్టుకు సహజమైన మెరుపును ఇవ్వడానికి బీట్రూట్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.
బీట్రూట్ రసం వల్ల జుట్టుకు రంగు అంటుకుంటుందని ఆందోళన చెందాల్సిన పని లేదు; ప్యాక్ వేసుకుని ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో కడిగితే ఆ రంగు సులభంగా పోతుంది.
పబ్మెడ్ అధ్యయనాల ప్రకారం మరింత ఒత్తైన జుట్టు కోసం బీట్రూట్ రసానికి అర కప్పు ఉసిరి రసం, 1 టీస్పూన్ బాదం నూనె , 3 టీస్పూన్ల విటమిన్ ఇ రసం కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు. ఉత్తమమైన , శాశ్వత ఫలితాల కోసం పైన పేర్కొన్న హెయిర్ ప్యాక్స్‌లో ఏదో ఒకదానిని వారానికి రెండుసార్లు ఉపయోగించడం మంచిది.




