Clay Pot: వేసవిలో మట్టి కుండలో నీళ్లు తాగితే ఏమౌతుందంటే!

వేసవి ఎండల్లో మట్టికుండ నీళ్లు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ, పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Ramya Thota
Updated on: 1 May 2026 6:18 PM IST
Claypot
X

Claypot 

వేసవి కాలం ఎండలు మండిపోతున్న వేళ గొంతు ఎండిపోతున్న సమయంలో మట్టికుండ నుంచి వచ్చే చల్లటి నీళ్ల సువాసన మరే ఇతర పానీయం ఇవ్వదంటే అతిశయోక్తికాదు.




మట్టిలో ఉండే గుణాల వల్ల నీళ్లు సహజంగా శుద్ధి అవ్వడమే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుందని కొన్ని అధ్యయానాలు కూడా చెబుతున్నాయి.




​ఎండా కాలంలో కొద్దిసేపు బయట తిరిగినా వడదెబ్బ తగులుతుంది. అలా కాకుండా ఉండాలంటే మట్టిపాత్రల్లో నిల్వ చేసిన నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.





శరీరంలో ఆమ్లగుణం పెరిగినప్పుడు కుండలో నీటిని తాగడం వల్ల శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీని వల్ల గ్యాస్‌, అసిడీటీ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.





మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది టెస్టోస్టెరాన్‌ స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుందట. మట్టిలో ఉండే ఖనిజ లవణాలే ఇందుకు కారణం. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి.





ఫ్రిజ్‌లో నీళ్లు తాగడం వల్ల టాన్సిల్స్‌, జలుబు, దగ్గుతో బాధపడే వారికి అంత మంచిది కాదు. కుండ నీళ్లు తాగడం వల్ల గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మట్టిలోని సహజ గుణాల వల్ల గొంతుకు హాయిని కలిగిస్తుంది.












Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story