Best Mileage Cars : బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 6 హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ కార్లు..!

Best Mileage Cars : పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ కార్లు. ఇండియాలో ప్రస్తుతం మారుతి సుజుకి,

G Krishna
Published on: 14 May 2026 1:15 PM IST
Best Mileage Cars
X

Best Mileage Cars

Best Mileage Cars : పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ , ఎలక్ట్రిక్ కార్లు. ఇండియాలో ప్రస్తుతం మారుతి సుజుకి, టొయోటా, హోండా, కియా వంటి కంపెనీలు అదిరిపోయే మైలేజ్ ఇచ్చే సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ రన్నింగ్ కాస్ట్, లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీతో దూసుకుపోతున్న టాప్ 6 కార్ల వివరాలను చూసేయండి.




మారుతి సుజుకి విక్టోరిస్ (Victoris): ఇది ఇండియాలో మోస్ట్ అఫర్డబుల్ హైబ్రిడ్ SUV. కేవలం రూ. 10.49 లక్షల స్టార్టింగ్ ప్రైస్‌తో పాటు ఏకంగా 28.65 kmpl మైలేజీని ఇస్తుంది.




మారుతి సుజుకి గ్రాండ్ విటారా: ఇండియన్ మార్కెట్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ SUV. ఇది 27.97 kmpl మైలేజ్ ఇవ్వడమే కాకుండా, సిటీలో కేవలం బ్యాటరీ (EV Mode) పవర్‌తో నడుస్తుంది.



టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్: టొయోటా నమ్మకంతో వస్తున్న ఈ కారులో స్మూత్ హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని బ్యాటరీపై కంపెనీ 8 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది.



హోండా సిటీ eHEV: సెడాన్ లవర్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులోని అడ్వాన్స్‌డ్ డ్యూయల్ మోటార్ సిస్టమ్ 27 kmpl మైలేజీని ఇస్తూనే, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లను అందిస్తుంది.



కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ: కియా నుండి వస్తున్న ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇందులో బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ. 3.3 చెల్లించే BaaS ప్లాన్ ఉంది.





BYD అట్టో 3 & సీలియన్ 7: చైనా దిగ్గజం BYD నుంచి వస్తున్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లలో సేఫ్టీ కోసం వరల్డ్ ఫేమస్ 'బ్లేడ్ బ్యాటరీ' టెక్నాలజీని వాడారు. జూలై 1 నుండి వీటి ధరలు పెరగబోతున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story