Hair Growth: జుట్టు రాలడం, బట్టతల సమస్యలతో టెన్షనా?.. ఈ 4 సూపర్‌ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!
Hair Growth: నేటి రోజుల్లో మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు రాలడం, బట్టతల సమస్యలతో బాధపడుతున్నారు.
Hair Growth: జుట్టు రాలడం, బట్టతల సమస్యలతో టెన్షనా?.. ఈ 4 సూపర్‌ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!
Hair Growth: నేటి ఆధునిక కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి తలపై జుట్టు విపరీతంగా పలుచబడటంతో పెళ్లిళ్లు కాక మానసిక వేదన అనుభవిస్తున్నారు. మరికొందరైతే బట్టతల వస్తుందేమో అనే భయంతో నలుగురిలోకి రావడానికి కూడా సంకోచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిగులుచెందకుండా మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యం, చర్మం, జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రకాల సూపర్‌ఫుడ్స్‌ను క్రమం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి, మళ్లీ కొత్త జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఆ అద్భుతమైన సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. నేరేడు పండ్లు (Black Plum):
నేరేడు పండులో విటమిన్ 'సి' (Vitamin C) తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను (Hair Follicles) డ్యామేజ్ కాకుండా, ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలో ప్రోటీన్ కొల్లాజెన్‌గా పనిచేస్తూ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తక్షణమే నివారిస్తాయి.
2. డ్రై ఫ్రూట్స్ (Dry Fruits):
రోజూ తినే ఆహారంలో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను భాగం చేసుకోవాలి. వీటిలో బయోటిన్, విటమిన్ బి7 (Vitamin B7) గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను మెరుగుపరిచి.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. జుట్టుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, శరీరం లోపల వచ్చే వాపుల (Inflammation) ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.
3. చియా విత్తనాలు (Chia Seeds):
చియా గింజలు అత్యంత తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఈ విత్తనాలను స్నాక్స్ రూపంలో గానీ, స్మూతీలలో గానీ కలిపి తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అంది, జుట్టు కాంతివంతంగా మారుతుంది.
4. బచ్చలికూర (Spinach):
ఆకుకూరల్లో రారాజైన బచ్చలికూరలో విటమిన్ ఎ, సి, ఐరన్, ప్రొటీన్, ఫోలేట్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి. కొన్నిసార్లు శరీరంలో రక్తం లేకపోవడం (రక్తహీనత లేదా అనీమియా) వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది. కాబట్టి బచ్చలికూరను తరచూ కూర వండుకుని తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరిగి, జుట్టు రాలడం ఆగడమే కాకుండా ఒత్తుగా మారుతుంది.




