Weight Loss Tips: కష్టపడి వర్కవుట్స్ చేయక్కర్లేదు.. ఇష్టంగా ఈ టిఫిన్స్ తింటే బరువు ఈజీగా తగ్గుతారు!

Weight Loss Tips: కఠినమైన వర్కవుట్స్, యోగా చేయకుండానే కేవలం జీవనశైలిలో మార్పులు చేస్తూ సులభంగా బరువు తగ్గవచ్చు.

Arun Chilukuri
Published on: 24 Jun 2026 12:26 PM IST
Weight Loss Tips
X

Weight Loss Tips: కష్టపడి వర్కవుట్స్ చేయక్కర్లేదు.. ఇష్టంగా ఈ టిఫిన్స్ తింటే బరువు ఈజీగా తగ్గుతారు!

Weight Loss Tips: ఈ రోజుల్లో బరువు పెరగడం ఎంత సులభమో.. పెరిగిన బరువును తగ్గించుకోవడం అంతకంటే కష్టం. బరువు తగ్గడం కోసం చాలామంది ఉదయం పూట రన్నింగ్, జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్స్‌, యోగా వంటివి చేస్తూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, శరీరానికి శ్రమ ఇవ్వకుండానే కేవలం మన జీవనశైలి, ఆహార అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి సులువుగా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. దీనివల్ల రోజంతా అతిగా తినకుండా ఉంటారు, ఫలితంగా ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం టిఫిన్‌గా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


1. ఓట్ మీల్ (Oatmeal):

ఉదయాన్నే టిఫిన్‌గా ఓట్ మీల్ తినడం వల్ల సులభంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇందులో ప్రోటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాదు ఇది శరీరానికి తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. ఓట్స్ తిన్న తర్వాత పదే పదే ఆకలి వేయదు. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.


2. పోహా (Poha / అటుకులు):

పోహా తినడానికి చాలా రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది చాలా తక్కువ కేలరీలు కలిగిన అల్పాహారం. బరువు తగ్గించుకోవాలని డైట్ ప్లాన్ చేసేవారు తమ అల్పాహారంలో పోహా తినడం అలవాటు చేసుకోవాలి. అయితే దీనిని తయారుచేసేటప్పుడు కూరగాయలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల త్వరగా ఆకలి వేయదు.


3. ఉప్మా (Upma):

రవ్వ మరియు రకరకాల కూరగాయలతో చేసే ఉప్మా సులభంగా జీర్ణమవుతుంది. ఇది ఒక తేలికపాటి ప్రోటీన్ ఆహారం. దీనిని చాలా తొందరగా, సులభంగా తయారుచేయవచ్చు. బరువు తగ్గాలని ఆలోచించేవారికి ఉప్మా ఒక బెస్ట్ ఆప్షన్. దీనిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల మళ్లీ మళ్లీ ఏదో ఒకటి తినాలనే కోరిక (Cravings) అదుపులో ఉంటుంది.


4. ఇడ్లీ (Idli):

ప్రతిరోజు ఉదయం పూట ఇడ్లీని టిఫిన్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవిరిపై ఉడికించడం వల్ల ఇడ్లీలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది సులువుగా జీర్ణమవడమే కాకుండా, దీనిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపించి ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా తరచుగా ఆహారం తీసుకునే అలవాటు తగ్గి బరువు నియంత్రణలోకి వస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story