Blinkit Offer 2026: ఐస్‌క్రీమ్ కోసం ఫోన్ ముందు గట్టిగా అరవాల్సిందే! బ్లింకిట్ సరికొత్త ‘Scream’ ఛాలెంజ్.. నెట్టింట వైరల్!
Blinkit Offer 2026: ఐస్‌క్రీమ్ కావాలా? అయితే ఫోన్ ముందు గట్టిగా అరవండి! ప్రముఖ క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ ‘స్క్రీమ్ ఫర్ ఐస్‌క్రీమ్’ పేరుతో సరికొత్త వైరల్ ఛాలెంజ్ తీసుకొచ్చింది.
Blinkit Offer 2026: ఐస్‌క్రీమ్ కోసం ఫోన్ ముందు గట్టిగా అరవాల్సిందే! బ్లింకిట్ సరికొత్త ‘Scream’ ఛాలెంజ్.. నెట్టింట వైరల్!
Blinkit Offer 2026: వచ్చిందంటే చాలు కూల్ కూల్‌గా ఐస్‌క్రీమ్‌లు తినడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. మార్కెట్లో ఐస్‌క్రీమ్‌లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ క్విక్ కామర్స్ దిగ్గజం ‘బ్లింకిట్’ (Blinkit) ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియాతో ముందుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు “స్క్రీమ్ ఫర్ ఐస్‌క్రీమ్” (Scream for Ice Cream) పేరుతో సరికొత్త ఛాలెంజ్‌ను లైవ్‌లోకి తెచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది.
అసలు ఏంటో ఈ ‘Scream’ ఛాలెంజ్?
సాధారణంగా యాప్స్‌లో ప్రోమో కోడ్‌లు టైప్ చేయడం లేదా స్పిన్ వీల్ తిప్పడం ద్వారా డిస్కౌంట్లు రావడం చూసుంటాం. కానీ బ్లింకిట్ రూట్ మార్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి. యూజర్లు మొదట బ్లింకిట్ యాప్ ఓపెన్ చేసి హోమ్‌పేజీలో కనిపించే “స్క్రీమ్ ఫర్ ఐస్‌క్రీమ్” బ్యానర్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ ఫోన్ మైక్ ముందు 15 సెకన్ల పాటు గట్టిగా అరవాల్సి ఉంటుంది. యూజర్ ఎంత ఎక్కువ డెసిబెల్స్ శబ్దంతో, ఎంత గట్టిగా అరిస్తే.. అంత పెద్ద డిస్కౌంట్ కూపన్ జనరేట్ అవుతుంది.
వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే..
ఈ ఫన్నీ ఫీచర్‌లో బ్లింకిట్ యాప్ యూజర్ యొక్క వాయిస్ లేదా అరుపు శబ్దాన్ని ఫోన్ మైక్ ద్వారా రియల్ టైమ్‌లో కొలుస్తుంది. ఆ సౌండ్ లెవెల్స్ ఆధారంగా అల్గారిథమ్ ప్రత్యేకమైన ఆఫర్ కూపన్లను కస్టమర్లకు అందిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ కూపన్లు కొన్ని ఎంపిక చేసిన పాపులర్ ఐస్‌క్రీమ్ బ్రాండ్లపై మాత్రమే వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.
రోడ్లపై కూడా అరుస్తూ వీడియోలు..
ప్రస్తుతం యువత ఈ ఛాలెంజ్‌ను ఒక క్రేజీ గేమ్‌లా ఆడేస్తున్నారు. రూమ్‌లలో ఫ్రెండ్స్‌తో కలిసి ఎవరు గట్టిగా అరుస్తారో అని పోటీ పడుతూ ఫన్నీ రీల్స్, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా రోడ్లపై, పబ్లిక్ ప్లేసుల్లో కూడా అరుస్తూ వీడియోలు చేస్తుండటంతో ఈ ట్రెండ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్
బ్లింకిట్ ఎప్పటికప్పుడు తన వినూత్న మార్కెటింగ్ స్టైల్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వినోదాన్ని (Fun), షాపింగ్‌ను కలిపి సరికొత్త ప్రమోషన్ తీసుకురావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. “ఐస్‌క్రీమ్ డిస్కౌంట్ కోసం ఇరుగుపొరుగు వాళ్లు భయపడేలా అరవాలా?” అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. “మార్కెటింగ్ అంటే బ్లింకిట్‌దే.. చాలా ఫన్‌గా ఉంది” అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సమ్మర్‌లో బ్లింకిట్ ఐడియా మాత్రం గట్టిగానే క్లిక్ అయిందని చెప్పొచ్చు.




