Cardamom Health Benefits: రోజూ భోజనం తర్వాత ఒక యాలక నమిలితే.. ఆ సమస్యలన్నీ మాయం

Cardamom Health Benefits: మన భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉన్న యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 12:02 PM IST
Cardamom Health Benefits:
X

Cardamom Health Benefits: రోజూ భోజనం తర్వాత ఒక యాలక నమిలితే.. ఆ సమస్యలన్నీ మాయం

Cardamom Health Benefits: మన భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు కేవలం మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు.. వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా దాగున్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టే యాలకులను "సుగంధ ద్రవ్యాల రాణి''గా పిలుస్తారు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ యాలకులను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం.


1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది

యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఒక యాలక గింజను నమలడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, ఇది కడుపులో మంటను కూడా నయం చేస్తుంది.


2. నోటి దుర్వాసనకు చెక్

యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన క్రమంగా తగ్గిపోతుంది. అలాగే చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఇవి రక్షిస్తాయి. మంచి మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తాయి.


3. గుండె ఆరోగ్యానికి మేలు

రక్తపోటు (బీపీ)ని నియంత్రణలో ఉంచడానికి యాలకులు తోడ్పడతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె జబ్బులు వచ్చే ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.


4. శ్వాసకోస ఇబ్బందుల నుంచి ఉపశమనం

తరచూ దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి యాలకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇవి ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి, శ్వాస సులభంగా తీసుకునేలా చేస్తాయి.


5. ఒత్తిడి, డిప్రెషన్ దూరం

ఇటీవలి కాలంలో వర్క్ ప్రెజర్ వల్ల చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నారు. అలాంటి వారు రోజూ యాలకుల టీ తాగడం లేదా ఒక యాలకను నోట్లో వేసుకుని నమలడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story