Health: మధుమేహం,గుండె ఆరోగ్యానికి మేలు చేసే నల్ల పండ్లు!

Jamun fruit health benefits: వేసవి ముగిసిన తరువాత లభించే నేరేడు పండ్లు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి పెంపులో కీలకంగా సహాయపడతాయి.

Ramya Thota
Published on: 29 April 2026 6:23 PM IST
Jamun fruit health benefits
X

Jamun fruit health benefits

నేరుడు పండ్లు చూడటానికి నల్లటి రంగు.. తీపి, వగరు కలగలిపిన రుచి. వేసవి కాలం ముగిసి తొలి చినుకులు పలకరించే సమయంలో ప్రకృతి మనకు ఇచ్చే అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు.




గర్‌ ఉన్న వాళ్లకు నేరేడు పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరమని వైద్యులు సైతం వివరిస్తున్నారు.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.







నేరుడు పండులో గుండెకు మేలు చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి హార్ట్‌ స్ట్రోక్‌, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.





నేరుడు పండులో ఉండే యాస్ట్రింజెంట్‌ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా విరేచనాలు, డయేరియాను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.





నేరేడు పండ్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడి మొటిమలు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.










Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story