Met Gala 2026: రెడ్ కార్పెట్‌పై తారల ఫ్యాషన్ విన్యాసాలు!

Met Gala 2026: రెడ్ కార్పెట్‌పై కళాత్మక దుస్తులతో మెరిసిన అంతర్జాతీయ తారలు. రిహానా, బ్లాక్ పింక్ లీసా, అన్ హాత్వే మరియు నికోల్ కిడ్మాన్ అద్భుతమైన గౌన్ల వివరాలు మీకోసం.

Arun Chilukuri
Published on: 5 May 2026 12:23 PM IST
Met Gala 2026
X

Met Gala 2026: రెడ్ కార్పెట్‌పై తారల ఫ్యాషన్ విన్యాసాలు!

Met Gala 2026: ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుక 'మెట్ గాలా 2026' కన్నుల పండువగా సాగింది. ఈ ఏడాది "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" (Fashion is Art) అనే థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు తమ అద్భుతమైన డిజైన్లతో, కళాత్మక సృజనతో రెడ్ కార్పెట్‌పై మంత్రముగ్ధులను చేశారు.

రెడ్ కార్పెట్ వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచిన తారలు:


రిహానా (Rihanna): ఎప్పటిలాగే రిహానా తన విలక్షణ శైలిని చాటుకుంది. 'మెయిసన్ మార్గిలా' డిజైన్ చేసిన మెటాలిక్ గౌన్‌లో ఆమె ఒక సజీవ శిల్పంలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


బ్లాక్ పింక్ లీసా (Lisa): ఈ వేడుకలో లీసా ధరించిన 'రాబర్ట్ వున్' వైట్ సెమీ-షీర్ గౌన్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో ఆమె స్వంత 3D స్కాన్డ్ చేతుల డిజైన్ ఉండటం విశేషం.


అన్ హాత్వే (Anne Hathaway): మైఖేల్ కోర్స్ రూపొందించిన నలుపు మరియు తెలుపు హ్యాండ్-పెయింటెడ్ గౌన్‌లో అన్ హాత్వే మోడ్రన్ ప్రిన్సెస్‌ను తలపించింది.


బ్లేక్ లైవ్లీ (Blake Lively): మెట్ గాలా ఫేవరెట్ బ్లేక్ లైవ్లీ ఈసారి 'వర్సాచే' ఆర్కైవల్ బాల్ గౌన్‌లో క్లాసిక్ లుక్‌తో అలరించింది.


నికోల్ కిడ్మాన్ (Nicole Kidman): ఈ ఏడాది కో-చైర్‌గా వ్యవహరించిన నికోల్ కిడ్మాన్, ఫెదర్ డీటెయిల్స్‌తో కూడిన ఎరుపు రంగు షిమ్మరీ 'చానల్' గౌన్‌లో మెరిసిపోయింది.


వీనస్ విలియమ్స్ (Venus Williams): మరో కో-చైర్ వీనస్ విలియమ్స్ 'స్వరోవ్‌స్కీ' గౌన్‌లో అత్యంత హుందాగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.


మర్గోట్ రోబీ తన గోల్డ్ చానల్ గౌన్‌తో మెరవగా, ఎమ్మా చాంబర్‌లైన్ కలర్‌ఫుల్ మగ్లర్ గౌన్‌లో సందడి చేసింది. గ్వెండోలిన్ క్రిస్టీ రెడ్ మెర్మైడ్ స్టైల్ గౌన్‌లో తనదైన ముద్ర వేసింది.


ఇషా అంబానీ..(Isha Ambani) అనైతా ష్రాఫ్ అడజానియా స్టైలింగ్‌లో, స్వదేశ్‌లోని నిపుణులైన కళాకారులు స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన, ప్రత్యేకంగా రూపొందించిన గౌరవ్ గుప్తా చీరను ధరించారు. ఈ ఏడాది ప్రతి అవుట్‌ఫిట్ ఒక గొప్ప కళాఖండంగా మారి ఫ్యాషన్ ప్రియులకు కనువిందు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story