Photo Gallery: ఎన్టీఆర్ జయంతి.. ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యుల ఘన నివాళి!

Photo Gallery: నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 28 May 2026 12:33 PM IST
Photo Gallery
X

Photo Gallery: ఎన్టీఆర్ జయంతి.. ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యుల ఘన నివాళి!

NTR Jayanthi Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయాన్నే పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి మహానాయకుడికి ఘనంగా నివాళులర్పించారు.

కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు ఆయన చేసిన మరువలేని సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి చేసిన ఆ అపురూప దృశ్యాల ఫోటో గ్యాలరీ మీకోసం.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story